పుట:Hello Doctor Final Book.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొడవలు ఎక్కువగా ఉంటాయి. వీరు మధ్యమధ్యలో మానసికముగా కుంగిపోతుంటారు. అప్పుడు వీరి ప్రవృత్తి పూర్తిగా మారిపోతుంది. దిగులు లక్షణాలు అప్పుడు ప్రస్ఫుటమవుతాయి. ఈ ద్విధ్రువవ్యాధి వంశపరముగా రావచ్చును. ఈ ద్విధ్రువ వ్యాధిగ్రస్థులలో కుంగుదల  కలిగినప్పుడు   ఆత్మహత్యల అవకాశము పెరుగుతుంది. ఇరువది సంవత్సరాల కాలములో సుమారు ఆరుశాతపు వ్యాధిగ్రస్థులు ఆత్మహత్యకు పాల్పడుతారు. పిచ్చి (Schizophrenia )

పిచ్చివ్యాధి గలవారి  మానసికస్థితి వాస్తవానికి వైరుధ్యముగా ఉంటుంది. దృశ్యభ్రాంతులు (లేని విషయాలు గోచరించడము; Visual hallucinations), శ్రవణభ్రాంతులు ( లేనివి వినిపించడము ; Auditory hallucinations) కలగడము వలన వీరు నిజ ప్రపంచములో కాక వేఱే లోకములో ఉంటారు. జీవితకాలములో వెయ్యిమందిలో మూడు నుంచి ఏడుగురు వ్యక్తులలో యీ రుగ్మత వేఱు వేఱు స్థాయిలులో  కనిపించవచ్చు. వీరిలో కూడా కుంగుదల కలిగే అవకాశాలు మెండు. ఆత్మహత్యలకు వీరు కూడా పాల్పడవచ్చును. మానసికవ్యాధులు యితర వ్యాధుల వలన కూడా కలుగవచ్చును. మెదడు, ఊపిరితిత్తులు, క్లోమములలో కర్కటవ్రణముల (Cancers) వలన మానసిక విభ్రాంతి కలుగవచ్చును.

సూక్ష్మజీవులు కలిగించే, న్యుమోనియా, టైఫాయిడ్ జ్వరము, సిఫిలిస్, మెదడువాపు (Encephalitis), కాలేయతాపము వలన, గర్భనిరోధపు మందులు (Oral contraceptives), రిసెర్పిన్ (రక్తపుపోటుకు వాడే వారు. ఈ దినములలో దీని వాడకము లేదు) బీటా గ్రాహక అవరోధకములు (beta blockers), కార్టికోస్టీరాయిడులు, మూర్ఛమందులు, మైగ్రేను తలనొప్పి మందులు, మానసికవ్యాధుల మందులు, హార్మోనుల వంటి ఔషధముల వలన,. గళగ్రంథి ఆధిక్యత (hyperthyroidism), గళగ్రంథి హీనత (hypothyroidism), సహగళగ్రంథి ఆధిక్యత (hyper parathyroidism), ఎడ్రినల్ కార్టికోస్టీరాయిడులు ఎక్కువ అగు కుషింగ్

284 ::