పుట:Hello Doctor Final Book.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కానుపు పిమ్మట 10 - 15 శాతము మందిలో దిగులువ్యాధి కనిపిస్తుంది. కానుపు అయిన రెండువారముల నుంచి ఒక నెల లోపుల సాధారణముగా యీ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆందోళన, ఆకలి నిద్రలలో మార్పులు, చిరాకు, కన్నీళ్ళు, నిస్సత్తువ వీరికి కలుగుతాయి.

బంధుమిత్రుల తోడ్పాటు, సహకారము, స్మృతివర్తన చికిత్సలు (Cognitive Behavioral Therapy), అవసరమైనపుడు ఔషధములతో యీ దిగులును  నివారించ వచ్చును. ఋతు సంబంధపు దిగులు ( Seasonal Depression)

కొంతమందిలో కొన్ని కాలములలో విచారము పొడచూపుతుంది. అమెరికాలో ప్రత్యేకముగా శీతాకాలములో చాలామంది విచారగ్రస్తులము అవుతామని చెబుతారు. వసంతకాలము రాగానే ఆ విషాదము తగ్గిపోతుంది. ద్విధ్రువ వ్యాధి ( Bipolar disorder )

కొందఱిలో ఉన్మాదపు పొంగు (Mania), అప్పుడప్పుడు విపరీతమైన దిగులు (Depression) కలుగుతుంటాయి. నిమ్న, ఉన్నతాలు కలిగే యీ వ్యాధిని  ద్విధ్రువ వ్యాధిగా పరిగణిస్తారు. సుమారు 1 శాతము మంది ప్రజ యీ మానసికవ్యాధికి గుఱి అవుతారు. ఈ వ్యాధి పురుషులు, స్త్రీలలో సమాన నిష్పత్తిలో కలుగుతుంది. పొంగు ఎక్కువయినప్పుడు వీరికి ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటుంది. భావములు పరంపరలుగా కలుగుతాయి. ఒక ఆలోచన నుంచి మరియొక ఆలోచనకు మస్తిష్కము ఉఱకలు పెడుతుంది. ఎక్కడలేని శక్తి వీరికి వస్తుంది. నిద్ర అవసరము తగ్గుతుంది. ఆకలి తగ్గుతుంది. ఉద్రేకము ఎక్కువగా ఉంటుంది. గట్టిగా మాట్లాడడము, అనవసరపు వాదనలకు, కయ్యాలకు  దిగడము చేస్తారు. ఇతరులు తమకు హాని చేస్తున్నారు అనే ఆలోచనలు కలిగి సంశయ వర్తనముతో (Paranoid behaviour) నిత్యము ఉంటారు. వీరికి శ్రవణ, దృశ్య భ్రమలు (Auditory and Visual hallucinations) మతిభ్రాంతి కూడా కలుగవచ్చును. వీరిలో మాదకద్రవ్యాలు, మద్యముల వినియోగము ఎక్కువగా ఉంటుంది. వీరికి వారి పోట్లాట తత్వము వలన  న్యాయ వ్యవస్థతో

283 ::