పుట:Hello Doctor Final Book.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మందచలనము, విచారవదనము, కళ్ళలో అశ్రువులు వీరి మానసిక ప్రవృత్తిని తెలుపుతాయి. విశేష మానసికపు క్రుంగు జీవితకాలములో 20 శాతపు స్త్రీలలోను 10 శాతపు పురుషులలోను పొడచూపుతుంది. ఈ రుగ్మత కలిగిన వారిలో సుమారు 10 శాతపుమంది జీవితకాలములో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ రుగ్మత 25 శాతమువారిలో  ఏదైనా బలవంతమైన కారణముచే ప్రస్ఫుటము అవుతుంది. చిన్నతనపు పెంపకములో అశ్రద్ధ, శారీరకక్షోభ, మానసికక్షోభ, లైంగికవేధింపులకు గుఱి అగుట, నిత్యజీవితములో ఒత్తుళ్ళకు గుఱి అగుట, నిరుద్యోగము, విద్యారంగములో వైఫల్యాలు, సహచరుల, కుటుంబసభ్యుల వేధింపులు యీ దిగులుకు దారితీయవచ్చును. మాదకద్రవ్యాలు, కొన్ని మందులు అకస్మాత్తుగా మానివేసినా దిగులు కలుగవచ్చును. చాలామందిలో పెద్ద కారణాలు ఉండక పోవచ్చును. చిన్న కుంగు ( Minor Depression ) :

కొందఱిలో ఆత్ములను, తల్లిదండ్రులను, జీవిత భాగస్వాములను కోల్పోయినప్పుడు, ఉద్యోగము పోయినా, ఆరోగ్యము సడలినా కలిగే విచారము దీర్ఘకాలము నిలువవచ్చును. మానసికపు కుంగు లక్షణాలు పరిమితముగా దీర్ఘకాలము ఉంటాయి. వీరిలో మద్యము, మాదకద్రవ్యాల దుర్వినియోగము కూడా ఉండవచ్చును. ప్రసవానంతరపు దిగులు (Postpartum Depression) :

282 ::