పుట:Hello Doctor Final Book.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ప్రత్యేకముగా నిదురించునపుడు) దానిపై కనుకప్పు ( eye patch ) ఉంచి కంటికి రక్షణ చేకూర్చాలి. వ్యాయామ, భౌతిక చికిత్సలు :

ముఖకండరములకు వ్యాయమ చికిత్సలు కండరముల బిగుతును కాపాడుటకు, శాశ్వత సంకోచములను అరికట్టుటకు ఉపయోగపడుతాయి. కాపడము వంటి ఉష్ణచికిత్సల వలన నొప్పి తగ్గే అవకాశము ఉన్నది. విద్యుత్ప్రేరణ చికిత్సల (electrical stimulation of nerve) వలన పరిశోధనలలో సత్ఫలితములు కనిపించలేదు. ముఖనాడిపై ఒత్తిడి తగ్గించే శస్త్రచికిత్సల (decompression) వలన ప్రయోజనము తక్కువ.

చాలా నెలల పిమ్మట కూడా ముఖకవళికలలో వికృతము పోని వారికి పునర్నిర్మాణ శస్త్రచికిత్సల (Reconstructive surgeries ) వలన ప్రయోజనము చేకూరవచ్చును. ఇతర వ్యాధుల వలన ముఖపక్షవాతము కలిగితే ఆయా వ్యాధులకు చికిత్సలు చేయాలి.

తాత్కాలిక ముఖపక్షవాతము (Bell’s Palsy) కలిగిన వారిలో రెండు మూడు వారములలో క్రమముగా వాత లక్షణములు తగ్గుముఖము పడుతాయి. చాలామందిలో మూడు, ఆరుమాసములలో లక్షణములు పూర్తిగా తగ్గిపోతాయి. చాలా తక్కువ శాతముమందిలో కండరముల శక్తి పూర్వస్థితికి రాకపోవచ్చును. కొంతమందిలో వ్యాధివలన  ధ్వంసము చెందిన ముఖనాడి తంతువులు పునరుజ్జీవనము (Regeneration) చెందినపుడు వాటి  గమ్యస్థాన గతులు తప్పుతాయి. నేత్రమండలిక కండరపు నాడీతంతులు వక్త్ర (నోటి) కండరములకు  చేరుకుంటే కన్ను మూసినపుడు వక్త్రకోణము పైకి లేస్తుంది. ఊర్ధ్వ లాలాజల కేంద్రము (Superior salivary nucleus) నుంచి

278 ::