పుట:Hello Doctor Final Book.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముఖపక్షవాతముతో బాటు  బయట చెవిపైన, చెవి ప్రాంతములోను విస్ఫోటము (Rash) ఉన్నట్లయితే అది  ఆటాలమ్మ - మేఖల విసర్పిణి విషజీవాంశముల  (Varicella - Herpes Zoster viruses ) వలన కలిగినదని నిర్ధారణ చేయవచ్చును. దానిని Ramsay Hunt Syndrome గా వర్ణిస్తారు. చికిత్స :

ఒక ముఖనాడికే పరిమితమయిన పక్షవాతము హెచ్చుశాతము మందిలో ముఖపక్షవాతముగా (Bell’s Palsy) పరిగణించవచ్చును. చాలామందిలో దానంతట అది తగ్గినా, త్వరిత ఉపశమనము కొఱకు, అవశిష్ట లక్షణములను అరికట్టుటకు చికిత్సలు అవసరము.

వీరికి ముఖనాడిలో తాపమును (inflammation) పరిమితము చేసి, లక్షణములు తొలగించుటకు తాప నిరోధకములైన కార్టికోష్టీరాయిడులను (Corticosteroids) ముఖ్యముగా ప్రెడ్నిసోన్ ను (Prednisone) వాడుతారు. వీటివలన హెచ్చుశాతపు మందిలో వ్యాధి లక్షణములు త్వరగా తగ్గుతాయి. విషజీవాంశ నాశకము - ఎసైక్లొవీర్ ని (antiviral drug- acyclovir) కార్టికోష్టీరాయిడులతో బాటు వాడుట వలన అదనపు ప్రయోజనము చేకూరవచ్చును. పరిశోధనల ఫలితములు నిర్దిష్టముగా లేవు.

నొప్పి తగ్గించుటకు ఏస్పిరిన్, ఎసిటెమైనొఫెన్, ఐబుప్రొఫెన్ లను వాడవచ్చు. కంటికి రక్ష :

కనురెప్ప పూర్తిగా మూసుకొనక కన్నీళ్ళు బయటకు ఒలుకుట వలన, కన్నీళ్ళ స్రావము తగ్గుట వలన కనుగుడ్డు ఆర్ద్రత కోల్పోయి ఆరిపోవుటకు, తాపమునకు గుఱి అగుటకు  అవకాశము గలదు. కాబట్టి కంటికి రక్షణ చేకూర్చాలి. కృత్రిమ బాష్పములను వాడి, కనురెప్పను మూసిఉంచి

277 ::