పుట:Hello Doctor Final Book.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అదురు, నీరసము కలుగవచ్చును. ఆ ప్రక్క కనుబొమ, నోటి భాగాలు క్రిందకు ఒరిగి ఉంటాయి. వ్యాధికి గుఱైన వైపు నుదుటిలో ముడుతలు లోపిస్తాయి. ఆ వైపు కంటిని పూర్తిగా మూయలేరు. కన్నీరు స్రావము తగ్గి కంటిలో ఆర్ద్రత తగ్గుతుంది.

ఆ పక్క నేత్రమండలిక కండరములో బిగుతు తగ్గుట వలన కన్నీళ్ళు బయటకు ఒలుకుతుంటాయి. నాసికా అధర వళిక (nasolabial fold) రూపు తగ్గి ఉంటుంది. నోటి కోణము క్రిందకు ఒరిగి ఉంటుంది. ఆ ప్రక్క చొంగ కారవచ్చును. ఊళ సరిగా వేయలేరు. ఆ పక్క నాలుకలో ముందు భాగములో రుచి లోపిస్తుంది. లాలాజల స్రవము తగ్గి నోరు పొడిగా ఉండవచ్చు. బుగ్గలలో గాలి పట్టి ఉంచలేరు. మాటలాడుటకు, తిండి తినుటకు, నీళ్ళు  త్రాగుటకు యిబ్బంది ఉంటుంది. చెవులలో గింగురు శబ్దము, మాటలధ్వని,  శబ్దముల హోరు హెచ్చయి అసౌఖ్యము కలుగవచ్చును. వ్యాధి నిర్ణయము :

ఇతర నాడీమండల వ్యాధి లక్షణములు, ఇతర వ్యాధుల లక్షణములు లేకుండా ఒకపక్క ముఖపక్షవాత లక్షణములు ఒకటి రెండు దినములలో పొడచూపినపుడు వ్యాధి లక్షణముల బట్టి తాత్కాలిక ముఖ పక్షవాతముగా (Bell’s Palsy) నిర్ధారణ చేయవచ్చును. వీరిలో యితర శరీరభాగములు పక్షవాతమునకు గురికావు. ఈ వ్యాధి ( Bell’s Palsy ) నిర్ధారణకు ప్రత్యేకమైన రక్తపరీక్షలు గాని యితర పరీక్షలు గాని లభ్యములో లేవు. ఈ వ్యాధి తాత్కాలికమైనది, వ్యాధి లక్షణములు కార్టికోష్టీరాయిడులతోను, ఏస్పిరిన్ తోను కొద్దివారములలో ఉపశమిస్తాయి కాబట్టి విస్తృతముగా ఖరీదైన పరీక్షలు చేయుట అనవసరము. విద్యుత్

కండరలేఖనము

(Electromyography)

ముఖనాడిలో హానిని, హానితీవ్రతను పసిగట్టవచ్చును.

పరీక్షతో

మధుమేహవ్యాధి, సార్కాయిడోసిస్ (Sarcoidosis), లైమ్స్ వ్యాధులను (Lyme’s disease) రక్తపరీక్షతో నిర్ధారణ చేయవచ్చును. లైమ్స్ వ్యాధి (Lyme’s disease) ఉత్త ర భూగోళవాసులలో

275 ::