పుట:Hello Doctor Final Book.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇతర నాడీమండల లక్షణములు లేకుండా, యితర వ్యాధి లక్షణములు లేనివారిలో కనిపించే ముఖ పక్షవాతమును బెల్స్ పక్షవాతముగా పరిగణించ వచ్చును.   వ్యాధి విధానము ( Pathogenesis ) :

బెల్స్ పక్షవాతము అధశ్చలననాడీ పక్షవాతమును కలిగిస్తుంది. బెల్స్ పక్షవాతమునకు కారణము తెలియదు. పరిశోధనలలో కొంతమందిలో జ్వరం పొక్కులు కలిగించే హెర్పీస్ సింప్లెక్స్ విషజీవాంశములు (Herpes Simplex viruses HSV1),కొంతమందిలో ఆటాలమ్మ, మేఖల విసర్పిణి జీవాంశములు (herpes zoster viruses) కనుగొనబడ్డాయి. వీరిలో సన్నని ముఖనాడి నాళములో (facial canal) పయనించే ముఖనాడిలో ( facial nerve ) తాపము ( inflammation ), వాపు కలిగి అస్థినాళము యిరుకయి ముఖనాడిపై కలిగే ఒత్తిడి వలన, రక్తప్రసరణ తగ్గుట వలన, తాపము వలన కలిగే విధ్వంసము వలన, నాడిపై గల కొవ్వుపొరకు ( myelin sheath ) కలిగే విధ్వంసము వలన నాడీ వ్యాపారమునకు భంగము ఏర్పడి  సంజ్ఞల ప్రసరణకు భంగము కలుగుతుంది. అందువలన ముఖకండరములలో నీరసము (వాతము) కలుగుతుంది. బెల్స్ పక్షవాతము చాలామందిలో తాత్కాలిక ప్రక్రియ. చికిత్సతోను, చికిత్స లేకపోయినా క్రమముగా కొద్ది వారములలో వ్యాధి నయమవుతుంది. కొంతమందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి  ఉపశమనము త్వరగా  కలుగుతుంది. ముఖనాడి పక్షవాత ( facial palsy ) లక్షణములు :

ఈ లక్షణముల తీవ్రత వివిధస్థాయిలలో ఉంటుంది. సాధారణముగా ముఖములో ఒకపక్కే పక్షవాతము కనిపిస్తుంది. అసాధారణముగా రెండు ముఖనాడులు పక్షవాతమునకు గుఱి కావచ్చును. వ్యాధి లక్షణములు అకస్మాత్తుగా కలిగి రెండు మూడు దినములలో ఉధృతి పొందుతాయి. జలుబు, తలనొప్పి, చెవి కింద చుట్టూ బాధ, కింద దవడలో నొప్పి కలుగవచ్చు. మిగిలిన శరీర భాగములలో పక్షవాతము ఉండదు. ముఖకండరములలో

274 ::