పుట:Hello Doctor Final Book.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముఖకండరములు ఇచ్ఛాపూర్వక చలనమును కోల్పోతాయి. ఆ కండరముల బిగుతు కూడా తగ్గుతుంది.

ముఖనాడీ కేంద్రము (Facial nerve nucleus) మస్తిష్క మూలములో వారధి (Pons) భాగములో ఉంటుంది. ఈ కేంద్రమునకు మెదడులో చలనవల్కలము (motor cortex) నుంచి నాడీ తంతువులు వచ్చి ఆ కేంద్రములో ఉన్న నాడీకణములతో సంధానము అవుతాయి. ముఖనాడీ కేంద్రమునుంచి ముఖనాడులు వెలువడుతాయి నాడీకేంద్రము లోను, నాడీకేంద్రము పైన కలిగే రుగ్మతల వలన కలిగే పక్షవాతమును ఊర్ధ్వచలననాడీ పక్షవాతము (upper motor neuron paralysis) గాను, నాడీకేంద్రము దిగువ, నాడిలో కలిగే రుగ్మతల వలన కలిగే పక్షవాతమును అధశ్చలననాడీ పక్షవాతము (Lower motor neuron paralysis) గాను పరిగణిస్తారు. కారణములు : ముఖనాడుల పక్షవాతమునకు సాధారణ కారణము బెల్స్ పక్షవాతము (Bell’s Palsy). ముఖ పక్షవాతము వివిధ సమాజములలో చాలా కాలముగా గుర్తించబడినా సర్. ఛార్లెస్ బెల్ 1826 లో దీనిని ముగ్గురు రోగులలో గమనించి లక్షణములను వర్ణించుటచే దీనికి Bell’s Palsy పేరు స్థిరపడింది. డెబ్బయి శాతపు ముఖ పక్షవాతములకు బెల్స్ పక్షవాతము కారణము.

సుమారు ముప్పయి శాతము మందిలో మెదడుపై గల పొరలలో కలిగే తాపము వలన (meningitis),  ప్రమాదములలో కలిగే దెబ్బల ( trauma ) వలన, కొత్త పెరుగుదలల (tumors) వలన, మస్తిష్కరక్తనాళ విఘాతముల వలన (Cerebrovascular accidents), మధుమేహవ్యాధి (Diabetes mellitus), సార్కాయిడోసిస్(Sarcoidosis), లైమ్స్ వ్యాధుల (Lyme’s disease) వలన ముఖ పక్షవాతము కలుగగలదు. కాని వీరిలో ఆ యా వ్యాధుల యితర లక్షణములు ఉంటాయి. నాడీమండలములో యితర భాగములపై కూడా ఆ యా వ్యాధుల ప్రభావము ఉండుట చేత యితర నాడీమండల లక్షణములు కూడా పొడచూపుతాయి.

273 ::