పుట:Hello Doctor Final Book.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దిశలలో పోగులు ఉండి పెదవుల చుట్టూ ఉండే యీ కండరము పెదవులను ముడుచుటకు, ఊళవేయుటకు, సన్నాయి, వేణువుల వాయిద్యములకు ఉపయోగపడుతుంది. చొంగ కారుటను అరికడుతుంది. వక్త్రకోణ నిమ్న కండరములు (Depressor anguli oris muscles) : ఇవి కనుబొమలు ముడిచి నపుడు పెదవి కోణాలను క్రిందకు లాగుతాయి. అధరోద్ధరణ కండరములు (Levator labii superioris muscles) : పై పెదవిని మీదకు చలింప జేస్తాయి.

వక్త్రకోణ ఉద్ధరణ కండరములు (Levator anguli oris muscles) : ముఖమునకు చెరివైపు ఉండే ఈ కండరము  ఆ ప్రక్క నోటి కోణమును ముక్కువైపు మీదకు లాగుటకు ఉపయోగపడుతుంది కపోలికలు (బుగ్గ కండరములు ; Buccinators) : బుగల ్గ లో ఉండే కండరములు బుగ్గలను దంతములకు అదిమి ఉంచి ఆహారము నములుటకు ఉపయోగపడుతాయి. చిబుక కండరములు (Mentalis muscles) : మూతి ముడుచుకొనుటకు, పెదవి విఱుచుటకు ఈ కండరములు ఉపయోగ పడుతాయి. కుడి ముఖకండరములకు కుడి ముఖనాడి,  ఎడమ కండరములకు ఎడమ ముఖనాడి నాడీప్రసరణ సమకూరుస్తాయి.

ముఖ

మెదడు నుంచి సంజ్ఞలు నాడులలో విద్యుత్తు ద్వారాను, నాడీతంతు నాడీకణ సంధానముల వద్దను, నాడీతంతు కండర సంధానముల ( neuromuscular junctions) వద్దను నాడీ ప్రసారిణుల (neurotransmitters) ద్వారా సంజ్ఞలు ప్రసరిస్తాయి. నాడితంతువుల నుంచి సంజ్ఞలు కండరములకు చేరునపుడు కండరములు ముకుళించుకొంటాయి. ముఖ పక్షవాతము ( Facial paralysis )

ముఖనాడిలో (facial nerve) వివిధ కారణముల వలన స్తంభనము ఏర్పడి నప్పుడు ఆ పక్క ముఖకండరములలో పక్షవాతము వస్తుంది. ఆ

272 ::