పుట:Hello Doctor Final Book.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడా ముఖనాడులపై ఆధారపడి ఉంటుంది.

ముఖకండరములు ముఖకవళికలను కలుగజేయుటే గాక కనురెప్పలతో కనులను పూర్తిగా మూసి ఉంచి కనులకు రక్షణ కలిగించుటకు, పెదవులను మూసి ఉంచి నోటి నుంచి లాలాజలము కారకుండా ఉండుటకు తోడ్పడుతాయి. ముఖ కండరములు ( Facial muscles )

పృష్ఠశిర లలాట కండరములు (Occipito frontalis muscles)

ఈ కండరములు తల వెనుక భాగము నుంచి నుదుటికి వ్యాపిస్తాయి. ఈ

కండరముల లలాటభాగములు కనుబొమలను పైకెత్తుటకు, నుదుటిలో ముడుతలు (wrinkles) కలిగించుటకు ఉపయోగపడుతాయి. నేత్రమండలిక (Orbicularis oculi) కండరములు : కనుగుంటల చుట్టూ మండలాకారాములో ఉంటాయి. ఇవి కనులు గట్టిగా మూసుకొనుటకు తోడ్పడుతాయి. భ్రుకుటి కండరములు (corrugator supercilli muscles) : ఇవి కనుబొమల లోభాగము వద్ద ఉంటాయి. కనుబొమలు ముడిపడుటకు (frowning) తోడ్పడుతాయి.   వక్త్రమండలిక కండరము (Orbicularis oris) : నోటి చుట్టూ వివిధ

271 ::