పుట:Hello Doctor Final Book.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24. ముఖ పక్షవాతము ( Facial Palsy ) ముఖ నాడులు ( Facial nerves )   

ముఖ కండరముల (Facial muscles) చలనము వలన ముఖ కవళికలు కలుగుతాయి. ముఖకండరముల చలనములు వామ (ఎడమ), దక్షిణ (కుడి) ముఖనాడుల (Facial nerves) సంజ్ఞలపై ఆధారపడుతాయి.

శరీరములో నాడులను కపాలనాడులు (Cranial nerves), వెన్నునాడులుగా (Spinal nerves) విభజించవచ్చును. కపాలనాడులు మెదడు వివిధభాగములు, మస్తిష్కమూలము (brain stem) నుంచి మొదలిడి కపాలములో వివిధ రంధ్రముల ద్వారా బహిర్గతమవుతాయి. వెన్నునాడులు వెన్నుపాము నుండి మొదలిడి వెన్నుపూసల మధ్య రంధ్రముల ద్వారా వెలువడుతాయి.   మనుజులలో 12 జతల కపాలనాడులు ఉంటాయి. ముఖనాడులు 7 వ జత కపాలనాడులు.   

ముఖనాడులు మస్తిష్కమూలములో (Brain stem) వారధి (Pons) రెండు వైపుల నుంచి వెలువడుతాయి. అవి కపాలపు వెనుక భాగములో పయనించి అంతర శ్రవణరంధ్రము (Internal auditory meatus) ద్వారా  కర్ణాస్థి (temporal bone) లోనికి ప్రవేశించి ముఖనాడి నాళము (facial canal) ద్వారా పయనించి స్టైలాయిడ్ రంధ్రము (styloid foramen) నుంచి కపాలము బయటకు వచ్చి చెవి చెంతన ఉన్న శ్రవణమూల లాలాజలగ్రంథి (parotid salivary gland) లోనికి చొచ్చి వివిధశాఖలుగా చీలుతుంది. ఆ శాఖలు లాలాజలగ్రంథి  ముందుభాగము నుంచి బయలుపడి వివిధ ముఖకండరములకు నాడీప్రసరణ కావిస్తాయి. లాలాజల గ్రంథులకు, బాష్ప గ్రంథులకు కూడా ముఖనాడులు నాడీ ప్రసరణ సమకూర్చుతాయి. నాలుక ముందు రెండింట మూడు భాగములలో రుచి

270 ::