పుట:Hello Doctor Final Book.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృత్రిమనాళిక (catheter) ద్వారా ధమనులలో నెత్తురుగడ్డలను విచ్ఛేదించు చికిత్స కొన్ని చోట్ల లభ్యము. ఏస్పిరిన్ :

ఏస్పిరిన్ దినమునకు 325 మి.గ్రా. మొదటి రెండు దినములు ఆపై దినమునకు 81 మి.గ్రా రక్తప్రసరణ లోపము వలన కలిగే విఘాతములకు ఉపయోగిస్తారు. రక్తఫలకములు (platelets) గుమికూడుటను ఏస్పిరిన్ అరికట్టి రక్తము గడ్డకట్టుటను మందగింపజేస్తుంది. క్లొ పిడోగ్రెల్ :

క్లొపిడోగ్రెల్ ( clopidogrel ) కూడా రక్తఫలకలు గుమికూడుటను అవరోధిస్తుంది. ఏస్పిరిన్ ను సహించనివారిలోను, ఏస్పిరిన్ వలన అవలక్షణములు కలిగినవారిలోను క్లొపిడోగ్రెల్ ను వాడవచ్చును. రక ్తఘనీభవన అవరోధకములు ( Anticoagulants ) :

కర్ణికా ప్రకంపనము (atrial fibrillation) గలవారిలోను, కృత్రిమ హృదయకవాటములు (prosthetic valves) కలవారిలోను హృదయములో రక్తపుగడ్డలు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. వీరిలో రక్తము గడ్డకట్టుటను మందగించు రక్తఘనీభవన అవరోధకములను (anticoagulants) మస్తిష్కవిఘాతములు నివారించుటకు ఉపయోగిస్తారు. Warfarin, Apixaban, Rivaroxaban, Dabigartan, కొన్ని ఉదహరణలు. మస్తిష్కవిఘాతములు కలిగినవారిలో మింగు కండరములలో (muscles of deglutition) నీరసము ఉంటే ఆహారము ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి (aspiration) వాటిలో తాపము (Pneumonia) కలిగించవచ్చును. మింగుట యిబ్బంది ఉన్నవారికి ముక్కుద్వారా కడుపులోనికి మృదు కృత్రిమ నాళములు (nasogastric tubes) చొప్పించి వాటి ద్వారా ద్రవ పదార్థములు ఆహారముగా యివ్వాలి.

267 ::