పుట:Hello Doctor Final Book.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

saline) ఎక్కిస్తూ రక్తప్రమాణము పెంచి మెదడుకు  ప్రసరణ బాగుగా జరిగేటట్లు చూడాలి. కపాలములో రక్తస్రావము (intracranial hemorrhage) జరిగితే  రక్తపుపోటు హెచ్చుగా ఉంటే క్రమముగా ఔషధములతో దానిని తగ్గించాలి. తల భాగమును శరీరము కంటె 15 డిగ్రీల ఎత్తులో ఉంచాలి. ఎరఖ్ నాయిడ్ క్రింద రక్తస్రావము (subarachnoid hemorrhage) జరిగితే ఆ యా కారణములకు చికిత్స అవసరము. ధమనుల బుడగలకు (aneurysms) శస్త్రచికిత్స అవసరము.

విశ్రాంతి, అవసరమైతే నొప్పి తగ్గించు మందులు, నిద్రకు మందులు, విరేచన దోహదకారులు వాడి కపాలము లోపల ఒత్తిడి (intracranial pressure) పెరుగుదలను అరికట్టాలి. నెత్తు రు గడ్డ ల విచ్ఛేదనము ( thrombolysis ) :

రక్తనాళములలో నెత్తురు గడలు ్డ ఏర్పడి (thrombosis), రక్తప్రసరణ లోపించి, మస్తిష్క విఘాతములు (strokes) కలుగుతే నెత్తురుగడ్డల విచ్ఛేదనము (thrombolytic therapy) ప్రయోజనము చేకూర్చే అవకాశము ఉన్నది. మస్తిష్క విఘాత లక్షణములు పొడచూపిన మూడుగంటల లోపల నెత్తురుగడ్డలు విచ్ఛేదించు ఔషధములు (thrombolytics : Recombinant tissue plasminogen activator) వాడితే వారిలో ఫలితములు మెరుగుగా ఉంటాయి. మస్తిష్క విఘాత లక్షణములు తీవ్రము కానప్పుడు, ఆ లక్షణముల నుంచి త్వరగా తేరుకుంటున్న వారిలోను, ఇటీవల కాలములో శస్త్రచికిత్సలు అయిన వారిలోను, ఇటీవల తలదెబ్బలు తగిలిన వారిలోను, జఠర మండలములోను, మూత్రాంగములలోను రక్తస్రావములు ఉన్నవారిలోను, రక్తపుపోటు హెచ్చుగా ఉన్నవారిలోను, రక్తఘనీభవన అవరోధకములు (anticoagulants) వాడుతున్నవారిలోను, మెదడులో అదివఱకు రక్తస్రావము జరిగిన వారిలోను, రక్తఫలకములు (platelets) తక్కువగా ఉన్నవారిలోను  రక్తపుగడ్డలు విచ్ఛేదించు మందులు వాడకూడదు. ఈ మందుల వలన మెదడులో రక్తస్రావము కలిగే అవకాశము కలదు.

266 ::