పుట:Hello Doctor Final Book.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎరఖనాయిడ్ పొర క్రింద రక్తస్రావము ( subarachnoid hemorrhage) కనుగొనుటకు వెన్నులో సూదిని దింపి నాడీద్రవము (cerebrospinal fluid) గ్రహించి పరీక్షలు సలుప వచ్చును . చికిత్స

మస్తిష్క విఘాత లక్షణములు కనిపించిన వారికి సత్వరముగా వైద్యశాలలలో తలకు గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణములు (computerized  axial tomography) చేసి కారణమును నిర్ధారించాలి. ఈ చిత్రీకరణలో రక్తస్రావము (hemorrhage) కనిపించకపోతే వ్యాధి కారణము రక్తప్రసరణ లోపముగా (ischemia) ఎంచాలి. రోగి రక్తపుపోటు, హృదయవేగము, ఉష్ణోగ్రత, ప్రాణవాయువు సంతృప్తతలు (oxygen saturation) పరిశీలించాలి. రక ్తపుపోటు నియంత్రణ

మస్తిష్క విఘాతములు కలిగిన వారిలో రక్తపుపోటు నియంత్రణలో చాలా జాగ్రత్త వహించాలి. వీరిలో తొలుత రక్తపుపోటు హెచ్చుగా ఉన్నా, తరువాత దినములలో దానంతట అదే క్రమేణ తగ్గుతుంది. రక్తనాళములో ప్రవాహమునకు అడ్డు ఉన్న  పై భాగములో రక్తపుపోటు తగ్గి కణజాలమునకు  ప్రసరణ సరిపోదు. అందువలన ఆ మస్తిష్క కణజాలానికి తగిన ప్రసరణ చేకూర్చుటకు రక్తపుపోటు కొంత ఎక్కువ ఉండుట అవసరము. రక్తపుపోటును బాగా తగ్గిస్తే నాడీమండల స్థితి క్షీణించే అవకాశములు ఎక్కువ అవుతాయి. అందువలన రక్తపుపోటును త్వరితముగా సామాన్య స్థితికి తగ్గించే ప్రయత్నములు చేయకూడదు. రక్తపుపోటు విషమస్థితికి చేరితే ; ముకుళితపు పోటు (systolic pressure) 220 మి. మీ. మెర్కురీ మించిన వారిలోను, వికాసపు పోటు (diastolic pressure) 120 మి.మీ. దాటినవారిలోను, హృదయవైఫల్యము ఉన్నవారిలోను, రక్తపుపోటును జాగరుకతతో నెమ్మదిగా తగ్గించే ప్రయత్నము చెయ్యాలి. దినమునకు 15 శాతమునకు మించి రక్తపుపోటును తగ్గించకూడదు. సిరలద్వారా తగినంత లవణజల ద్రావణము ( 0.9 % Normal

265 ::