పుట:Hello Doctor Final Book.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

communicating artery) ఒక శాఖ వెలువడి అంతర కంఠ ధమనితో (internal carotid artery) కలుస్తుంది. సంధాన ధమనులతో కలుపబడి మస్తిష్కధమనులు మెదడు క్రిందభాగములో ధమనీ చక్రము (arterial circle of Willis) ఏర్పరుస్తాయి. మెదడును కప్పుతూ డ్యూరా (Dura), ఎరఖ్నాయిడ్ (Arachnoid), పయా (pia) అను మూడు పొరలు ఉంటాయి. మస్తిష్క (రక ్తనాళ ) విఘాతములు ( Cerebrovascular accidents )

మస్తిష్క (రక్తనాళ) విఘాతములు (Cerebrovascular accidents) పక్షవాతముగానో, అపస్మారకము గానో పొడచూపుతాయి. ఇవి రక్తనాళములలో ధమనీ కాఠిన్యత (atherosclerosis) వలన రక్తపుగడ్డలు ఏర్పడి రక్తప్రసరణకు భంగము కల్పించుట వలన (thrombosis) గాని, రక్తప్రవాహములో రక్తపుగడ్డలు, యితర అవరోధక పదార్థములు (emboli) పయనించి సుదూర ప్రాంతములలో సన్నని నాళములలో అడ్డుపడి (embolism) రక్తప్రసరణకు భంగము కలిగించుట  వలన గాని, రక్తస్రావము వలన (hemorrhage) గాని కలుగుతాయి.

మస్తిష్క విఘాత లక్షణములు

మస్తిష్క విఘాత లక్షణములు మస్తిష్క విఘాతము (Cerebral stroke) ఏర్పడిన తీరు, స్థానము, తీవ్రతలపై ఆధారపడుతాయి. రక్తప్రసరణ లోపము (ischemia) వలన కలిగినపుడు లక్షణములు ఆకస్మికముగా కలిగినా లక్షణములలో  హెచ్చుతగ్గులు (fluctuations సాధారణముగా  కనిపిస్తాయి.

కంఠధమనిలో (carotid artery) దోషము ఉన్నపుడు ఆవలి పక్కనున్న దేహములో పక్షవాతము (paralysis) కలిగి కండరములు శక్తిని పూర్తిగానో, కొంతో నష్టపోతాయి. స్పర్శజ్ఞానములో నష్టము కలుగవచ్చును. సగంచూపు నష్టము (అర్ధాంధత్వము ; hemianopsia), మాట పోవుట (వాగ్నష్టము/వాజ్ఞ్నష్టము/aphasia),

261 ::