పుట:Hello Doctor Final Book.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7) పృష్ఠ సంధాన ధమని (Posterior communicating artery) 8) వెన్ను ధమని (Vertebral artery)

మెదడునకు రక్తము అంతర కంఠధమనులు (Internal carotid arteries), వెన్ను ధమనులు (vertebral arteries) ద్వారా ప్రసరిస్తుంది. రెండు పక్కలా కంఠధమనులు (common carotid arteries) కంఠములో బాహ్య కంఠధమనులు (external carotid arteries) అంతర కంఠధమనులుగా (internal carotid arteries) చీలుతాయి. అంతర కంఠధమనులు (internal carotids) కపాలము లోనికి ప్రవేశించి పురోమస్తిష్క ధమనులు (anterior cerebral arteries) అను శాఖలు  ఇస్తాయి. పురోమస్తిష్క ధమనులు మెదడులో లలాటభాగముల (frontal lobes) ముందు భాగములకు రక్తప్రసరణ చేకూరుస్తాయి. రెండు పురోమస్తిష్క ధమనులు పురోసంధాన ధమనులు  (anterior communicating arteries) అను  శాఖలతో  ఒకదానితో వేఱొకటి కలుపబడుతాయి.

పురోమస్తిష్క ధమని శాఖలను ఇచ్చిన పిదప,  అంతర కంఠధమనులు మధ్య మస్తిష్క ధమనులుగా (middle cerebral arteries) కొనసాగి లలాట భాగపు వెనుకభాగములకు, పార్శ్వభాగములకు (parietal lobes) రక్తప్రసరణ చేకూరుస్తాయి. కుడి, ఎడమ వెన్నుధమనులు (vertebral arteries) కపాలము వెనుక నుంచి పయనించి  కపాలములో  మూలిక (basilar artery) ధమనిగా ఒకటవుతాయి. మూలికధమని  మెడుల్లాకు, వారధికి ( Pons ), చిన్న మెదడుకు శాఖలు ఇచ్చి రెండు పృష్ఠమస్తిష్క ధమనులుగా (posterior cerebral arteries) చీలుతుంది.

పృష్ష్ఠమస్తిష్క ధమనులు మెదడు వెనుకభాగములకు (occipital lobes) కర్ణభాగములకు (temporal lobes) రక్తమును ప్రసరింపజేస్తాయి. ప్రతి పృష్ఠమస్తిష్క ధమని నుంచి పృష్ఠ సంధాన ధమనిగా (posterior

260 ::