పుట:Hello Doctor Final Book.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లలాటభాగములు పెద్దమెదడుకు ముందుభాగములో ఉంటాయి. ఇవి పార్శ్వభాగముల నుంచి మధ్యగర్తములతోను ( central sulci ), కర్ణభాగముల నుంచి పార్శ్వగర్తములతోను (lateral sulci) వేఱుచేయబడి ఉంటాయి. స్వయంనియంత్రణ, విచక్షణ, ప్రణాళికారచన, తర్కము  వంటి క్రియలు లలాటభాగములపై  ఆధారపడి ఉంటాయి.

లలాటభాగములో (Frontal lobe) మధ్యగర్తమునకు ముందున్న మెలికలో చలనవల్కలము (motor cortex) ఉంటుంది. చలనవల్కలములోని నాడీకణములపై (neurons) శరీరములోని ఇచ్ఛాకండరముల (voluntary muscles) ఇచ్ఛాచలనములు ఆధారపడి ఉంటాయి. కుడి చలనవల్కలము శరీరపు ఎడమ భాగపు ఇచ్ఛాకండరములను, ఎడమ చలనవల్కలము శరీరములోని  కుడి భాగపు ఇచ్ఛాకండరములను నియంత్రిస్తాయి.

256 ::