పుట:Hello Doctor Final Book.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23. మస్తిష్క రక ్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents ) మెదడు నిర్మాణము

మన శరీరములో వివిధ అవయవాలు నాడీమండలపు (nervous system) ఆధీనములో ఉంటాయి. నాడీమండలములో కేంద్ర నాడీమండలము (central nervous system), వికేంద్ర నాడీమండలము (Peripheral nervous system) భాగములు. కేంద్ర నాడీమండలములో పెద్దమెదడు (cerebrum), చిన్నమెదడు (cerebellum), వారధి(pons), మెడుల్లా ఆబ్లాంగేటా (medulla oblongata), కపాలనాడులు (cranial nerves) వివిధభాగములు. వికేంద్ర నాడీమండలములో వెన్నుపాము (spinal cord), వెన్నునాడులు (spinal nerves), సహవేదన నాడీవ్యవస్థ (sympathetic nervous system), పరానుభూత నాడీవ్యవస్థ (ParaSympathetic nervous system) భాగములు.

పెద్దమెదడు ఆలోచనలకు, విషయ గ్రహణమునకు, జ్ఞాపకశక్తికి, విచక్షణా జ్ఞా న మునకు, విషయ చర్చలకు, వివిధభావములకు స్థానము. పంచేంద్రియములు గ్రహించు వాసన, దృష్టి, వినికిడి, రుచి, స్పర్శాది సమాచారములు జ్ఞాననాడుల (sensory nerves) ద్వారా ప్రసరించి  పెద్దమెదడులో జ్ఞానముగా రూపొందుతాయి. పెద్దమెదడులో రెండు అర్ధ గోళములు (hemispheres) ఉంటాయి. రెండు అర్ధగోళములు corpus Callosum  అనబడే శ్వేత తంతువుల బంధనముచే కలుపబడి ఉంటాయి. ప్రతి అర్ధగోళములోను లలాటభాగము (frontal lobe), పార్శ్వభాగము (parietal lobe), కర్ణభాగము (temporal lobe), పృష్ఠభాగము (occipital lobe) ఉంటాయి.

255 ::