పుట:Hello Doctor Final Book.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

erosclerosis), హృద్రోగములు, హెచ్చుగా ఉంటాయి. కొవ్వులు, కొలెష్టరాలు తగ్గించే ష్టాటిన్ (statins) మందులు వాడుట వలన హృద్రోగములు, ధమనీ వ్యాధులు తగ్గించగలుగుతాము. మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( Renal replacement therapy):-

కేశనాళికాగుచ్ఛముల వడపోత ద్రవప్రమాణము (Glomerular filtration Rate - GFR) క్షీణించి దీర్ఘకాల మూత్రాంగవ్యాధి తీవ్రతరమయి  ఐదవ దశకు చేరినపుడు మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్సలు అవసరము అవుతాయి. GFR విలువలే కాక రోగి పోషణ, జీవవ్యాపార స్థితులు క్షీణించినపుడు ప్రత్యామ్నాయ చికిత్స మొదలు పెట్టుట మేలు.

ఉదరాంత్రవేష్టనము (peritonium) ద్వారా రక్తమును శుద్ధిచేయు ప్రక్రియ Peritoneal dialysis. దీనిని అరుదుగా వాడుతారు. రక్తనాళములలోని  రక్తము ను శుద్ధిచేయు ప్రక్రియ Hemodialysis. ఇది తఱచు వాడబడే ప్రక్రియ. పరమూత్రాంగ దాన  (renal transplantation) చికిత్సలో గ్రహీతకు అనుకూల  మూత్రాంగమును శస్త్రచికిత్సతో   చేరుస్తారు.

రక్తపీడనమును, మధుమేహ వ్యాధిని అదుపులో పెట్టుకొని దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిని నివారించుట, అదుపులో ఉంచుకొనుట వాంఛనీయము.

254 ::