పుట:Hello Doctor Final Book.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ సహగళగ్రంథి ఆధిక్యతగా (secondary hyperparathyroidism) పరిగణిస్తారు. శరీరములో విటమిన్ డి లోపమును సరిదిద్దుటకు  Secondary hyperparathyroism ను నివారించుటకు ఉత్తేజకర 1-25 డై హైడ్రాక్సీ వైటమిన్  డి (1-25- dihydroxy vitamin D) ని గాని, లేక దాని సమధర్మిని ( analog ) గాని వాడవలసిన అవసరము కలదు.

హెచ్చయిన ఫాస్ఫేటు విలువలను తగ్గించుటకు ఫాస్ఫేట్ బంధకములను (phosphate binders) వాడుతారు. కాల్సియం కార్బొనేట్ (CaCO3), కాల్సియం ఎసిటేట్, లాంథనమ్ కార్బొనేట్ (Lanthanum carbonate), సెవెలమెర్ కార్బొనేట్ (Sevelamer carbonate) కొన్ని ఫాస్ఫేటు బంధకములు. ఇవి జీర్ణమండలములో ఫాస్ఫేటు గ్రహణమును నివారిస్తాయి. రక ్త ఆమ్లీకృతము ( Metabolic acidosis ) :-

దీర్ఘకాల మూత్రాంగవ్యాధి కలవారిలో శరీరములో జనించే ఆమ్లపు విసర్జన మందగిస్తుంది. అందుచే రక్తము ఆమ్లీకృతమవుతుంది. ఇది జీవవ్యాపార ఆమ్లీకృతము (metabolic acidosis).

[ శ్వాసవైఫల్యము కలవారిలో బొగ్గుపులుసు వాయువు విసర్జన తగ్గి రక్తములో బొగ్గుపులుసు వాయువు (CO2 ) ప్రమాణములు పెరుగుటచే కలిగే ఆమ్లీకృతము  శ్వాసవ్యాపార ఆమ్లీకృము ( Respiratory acidosis ) ].

వీరిలో రక్తములో బైకార్బొనేట్ విలువలు తగ్గుతాయి. వారికి సోడియమ్ బైకార్బొనేట్  నోటి ద్వారా ( 650 మి.గ్రాలు - 1300 మి.గ్రా లు దినమునకు రెండు మూడు పర్యాయములు ఇచ్చి రక్తములో బైకార్బొనేట్ విలువలు 22 meq / L సమీపములో ఉండేటట్లు చూడాలి. సోడియం బైకార్బొనేట్ వలన శరీరములో లవణ, ద్రవభారములు పెరుగుటకు, రక్తపుపోటు పెరుగుటకు, కాళ్ళలో పొంగులు కలుగుటకు అవకాశము ఉన్నది. ధమనీ కాఠిన్యత, హృద్రోగములు :-

దీర్ఘకాల మూత్రాంగ వ్యాధులు కలవారిలో ధమనీ కాఠిన్యత (ath:: 253 ::