పుట:Hello Doctor Final Book.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉంటే ఇనుము లవణములు నోటిద్వారా గాని, సిరలద్వారా గాని ఇచ్చి లోపమును సరిదిద్దాలి.

ఇనుము లోపాలు, ఇతర పోషక పదార్థముల లోపాలు సరిదిద్దినా రక్తవర్ణకపు విలువ 10 గ్రాలు/డె.లీ కంటె తక్కువగా ఉంటే కృత్రిమ రక్తోత్పాదుల (erythropoiesis stimulating agents : ESAs) వాడుక అవసరము అవవచ్చును. వీటిని వాడునపుడు రక్తవర్ణకపు (hemoglobin) ప్రమాణములు 11 గ్రా.లు దాటకుండా  జాగ్రత్తపడాలి. ఎముకల బలహీనత :-

దీర్ఘకాల మూత్రాంగవ్యాధి మూడవ దశకు చేరినవారిలో విటమిన్ డి తగ్గుతుంది. [ విటమిన్ D3   ఖోలికాల్సిఫెరాల్  ( Cholecalciferol) చర్మము దిగువభాగములో సూర్యరశ్మి సహాయముతో ఉత్పత్తి అవుతుంది. కాలేయములో ఖోలికాల్సిఫెరాల్  హైడ్రాక్సిలేట్ అనే ఉత్ప్రేరకముతో  25హైడ్రాక్సీ ఖోలికాల్సిఫెరాల్ గా మార్పుచెందుతుంది. 25 హైడ్రాక్సీ ఖోలికాల్సిఫెరాల్ మూత్రాంగములలో ఉత్తేజకరమై 1-25- డై హైడ్రాక్సీ ఖోలికాల్సిఫెరాల్  లేక కాల్సిట్రయాల్ Calcitriol గా మారుతుంది. ] మూత్రాంగవ్యాధి కలవారిలో కాల్సిట్రయాల్ లోపించి రక్త ము లో కాల్సియమ్ విలువలు తగ్గుతాయి. ఫాస్ఫేటు విలువలు పెరుగుతాయి. కాల్సియమ్ జీవవ్యాపారముపై సహగళగ్రంథుల (parathyroid glands) ప్రభావము ఉంటుంది. రక్తములో కాల్సియమ్ విలువలు తగ్గినపుడు సహగళగ్రంథులు సహగళగ్రంథి స్రావమును ( parathyroid hormone) ఎక్కువగా స్రవిస్తాయి. సహగళగ్రంథి స్రావము ఎముకల నుంచి కాల్సియమ్ ని రక్తములోనికి తరలిస్తుంది. ఎముకలు అందుచే బలహీనపడుతాయి (osteomalacia).  ఆ పై ఎముకలలో  తంతు బుద్బుదములు ఏర్పడి Osteitis fibrosa cystica అనే వ్యాధికి దారితీస్తాయి. వీరిలో ఎముకల నొప్పులు, ఎముకలు సులభముగా విఱుగుట కలుగుతుంటాయి.

రక్తములో కాల్సియం తగ్గుటచే  సహగళగ్రంథి స్రావము అధికమగుటను

252 ::