పుట:Hello Doctor Final Book.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

dium polystyrene sulfonate  వంటి ఋణపరమాణు వినిమయ ఔషధములు (cation echange resins) వాడాలి. ద్రవపరిమాణ లోపము (hypovolemia) లేనివారిలో మూత్రకారకములు (diuretics) వాడి పొటాసియము విసర్జనను పెంచవచ్చును. ఫాస్ఫేటులు

ఆహారములో ఫాస్ఫేటుల (phosphates) వాడుకను 1  గ్రామునకు నియంత్రించుకోవాలి. వివిధరకముల పిక్కలు (nuts), నల్లని శీతల పానీయాలలో ఫాస్ఫేటు ప్రమాణములు హెచ్చుగా ఉంటాయి. అధిక రక ్త పీడనము :-

రక్తపీడనమును 140/ 90 మి.మీ. మెర్క్యురీ లోపు అదుపులో ఉంచుకోవాలి. అధిక రక్తపీడనమునకు Angiotensin Converting Enzyme inhibitors లను, కాని  Angiotensin Receptor Blockers లను కాని ప్రథమముగా ఎంచుకుంటారు. ఈ మందులు మూత్రాంగములకు రక్షణ చేకూరుస్తాయి. వీని వాడుక వలన రక్తములో క్రియటినిన్ ప్రమాణములు కొంత పెరుగుతాయి. మూల విలువలు కంటె 30 % మించి పెరుగుతే వాని మోతాదును తగ్గించాలి. ACE inhibitors, ARBs  రక్తద్రవపు పొటాసియమ్ విలువలను పెంచుతాయి కాబట్టి రెంటినీ కలిపి వాడుట మంచిది కాదు. శరీరములో ద్రవభారము (fluid overload) పెరిగి కాళ్ళు పొంగుతే మూత్రకారకములు (diuretics) అవసరము కావచ్చును. పాండురోగము ( Anemia ) :-

మూత్రాంగములలో రక్తోత్పాదిని (erythropoietin) అనే రసాయనము ఉత్పత్తి  అవుతుంది. అది ఎముకల మజ్జపై పనిచేసి ఎఱ్ఱకణముల ఉత్పత్తికి దోహదపడుతుంది. మూత్రాంగవ్యాధి మూడవ దశలో ఉన్నా, దాటినా రక్తపరీక్షలతో రక్తవర్ణకపు (hemoglobin) విలువలు తెలుసుకోవాలి. తగ్గుతే రక్తములోను, శరీరములోను ఇనుము విలువలు తెలుసుకొని లోపములు

251 ::