పుట:Hello Doctor Final Book.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేనట్లు జాగ్రత్తపడాలి.

మూత్రాంగ వ్యాధిగ్రస్థులలో ఎక్స్ రే వ్యత్యాసపదార్థాల (xray contrast materials) వాడుకలను కూడా నియంత్రించాలి. మూత్రాంగములకు వీటి వలన హాని కలుగవచ్చును. ఆహార నియంత్రణ ( Dietary restrictions ) :సోడియం :

దీర్ఘకాల మూత్రాంగ వ్యాధి  కలవారు భోజనములో సోడియం ని (ఉప్పు) తగ్గించుకోవాలి. దినమునకు  సోడియమ్ వాడుకను 3 గ్రాములకు మితము చేసుకోవాలి. హృదయవైఫల్యము (CHF) కూడా ఉంటే దినమునకు సోడియం వాడుక 2 గ్రాములకు తగ్గించాలి. పొటాసియం :

వీరు పొటాసియం వాడుకను దినమునకు 60 m.eq నియంత్రించు కోవాలి. నారింజ నిమ్మ రసములు, టొమోటాలు, అరటిపళ్ళు, బంగాళదుంపల లో పొటాసియం ఎక్కువగా ఉంటుంది. వీటి వాడుకను బాగా తగ్గించుకోవాలి. రక్తములో పొటాసియమ్ విలువలు ఎక్కువగా ఉన్నవారికి సోడియమ్ పోలిష్టైరీన్ సల్ఫొనేట్ (sodium polystyrene sulfonate ) వాడుతారు.

రక్తద్రవములో పొటాసియమ్ విలువలు ప్రమాదకర ప్రమాణములలో ఉండి (6 meq / dL మించి), విద్యుత్ హృల్లేఖనములో (electro cardiogram) మార్పులు ఉంటే, హృదయ రక్షణకు కాల్సియమ్ గ్లూకొనేట్ (calcium gluconate) సిరల ద్వారా ఇస్తారు. రక్తద్రవములోని పొటాసియమును కణముల లోపలకు మళ్ళించుటకు ఇన్సులిన్ + గ్లూకోజుల మిశ్రమమును సిరలద్వారా ఇస్తారు. బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములను (beta adrenergic receptor agonists) పీల్పుసాధనముల ద్వారా ఇచ్చి పొటాసియమ్ ను కణములలోనికి మళ్ళించవచ్చును. రక్తము ఆమ్లీకృతము అయితే (acidosis) సోడియమ్ బైకార్బొనేట్ (sodium bicarbonate) కూడా ఇవ్వవచ్చును. ఆపై శరీరములో పొటాసియమును తగ్గించుటకు so:: 250 ::