పుట:Hello Doctor Final Book.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

eases) అదుపులో పెట్టాలి.

రక్తపీడనము 140 / 90 m.m hg లోపల అదుపులో ఉంచాలి. మధుమేహవ్యాధిగ్రస్థులలో రక్తపు చక్కెర విలువలను అదుపులో ఉంచి  Hb A1c  7% లోపల ఉంచే ప్రయత్నము చెయ్యాలి. మూత్రప్రవాహమునకు అవరోధములు ఉంటే వాటిని తొలగించు ప్రయత్నము చెయ్యాలి. మూత్రాంగములకు రక్తప్రసరణ లోపములు ఉంటే వాటిని సరిదిద్దాలి.

ద్రవప్రమాణహీనతను  (hypovolemia) సరిదిద్దాలి. హృదయవైఫల్యము

(Congestive heart failure), జలోదరము (ascites) వంటి వ్యాధులకు తగిన చికిత్సలు చేసి మూత్రాంగముల  రక్తప్రసరణను మెరుగుపఱచాలి.

కీళ్ళనొప్పులకు వాడే ఐబుప్రోఫెన్ వంటి ష్టీ రా యిడులు కాని తాపహరముల (NonSteroidal Anti Inflammatory Drugs) వాడుక మానివేయాలి. వీటి వలన GFR తగ్గగలదు.

Angiotensin Converting Enzyme inhibitors ( ACE inhibitors), Angiotensin Receptor Blockers వలన GFR తగ్గగలదు. వీటి వలన రక్తద్రవములో క్రియటినిన్ విలువలు 30 % కంటె పెరుగుతే ఆ మందుల మోతాదులను వైద్యులు తగ్గిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్థులలో మూత్రములో ఆల్బుమిన్ విసరన ్జ (albuminuria) తగ్గించి మూత్రాంగవ్యాధిని అదుపులో పెట్టుటకు ACE inhibitors, ARBS ఉపయోగపడుతాయి. ఈ ఔషధములు కేశనాళికగుచ్ఛములలో పీడనము తగ్గించి మూత్రాంగ రక్షణకు తోడ్పడుతాయి. వీటి వలన రక్తములో పొటాసియమ్ విలువలు పెరిగే అవకాశము ఉన్నది కాబట్టి  ఆ రెంటినీ కలిపి వాడుట మంచిది కాదు. వీటిని వాడినపుడు రక్తములో పొటాసియమ్ విలువలు, క్రియటినిన్ విలువలు గమనిస్తూ ఉండాలి. అవసరమయితే మందుల మోతాదులు సరిదిద్దాలి. మూత్రాంగములపై విషప్రభావము గల amino glycoside antibiotics వంటి మందులు వీలయినంత వఱకు వాడకూడదు. తప్పనిసరి అయితే రక్తములో ఆ ఔషధముల విలువలు విషస్థాయిలో (toxic range)

249 ::