పుట:Hello Doctor Final Book.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

/ క్రియటినిన్  నిష్పత్తి తెలుసుకోవాలి. రక ్త పరీక్షలు :-

రక్తములో క్రియటినిన్ విలువలు నుంచి కేశనాళికాగుచ్ఛముల వడపోత ప్రమాణము (Glomerular Filtration Rate - GFR ) అంచనా వేసి దీర్ఘకాల మూత్రాంగవ్యాధి ఏ దశలో ఉన్నదో నిర్ణయిస్తారు.

రక్తపరీక్షలతో పాండురోగము (anaemia) ఉన్నదో, లేదో తెలుసుకోవాలి. రక్తములో చక్కెర విలువలు, విద్యుద్వాహక లవణముల (electrolytes) విలువలు  ఆల్బుమిన్ విలువలు, కొలెష్ట్రాలు, కొవ్వుపదార్థాల విలువలు కూడా తెలుసుకోవాలి. కాల్సియమ్, సహగళగ్రంథి స్రావక విలువలు (Parathyroid hormone) కూడా తెలుసుకోవాలి. శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ :-

శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ (ultrasonography) పరీక్షలతో మూత్రాంగముల పరిమాణము, ప్రతిధ్వనిత్వము (echogenicity), నిర్మాణములను పరీక్షించాలి. బహుళ బుద్బుద వ్యాధి (polycystic kidney disease), జలమూత్రాంగము (hydronephrosis), మూత్రనాళములలో శిలలు (ureteric calculi), ఇతర అవరోధములు, మూత్రాశయములో అసాధారణములు ఈ పరీక్ష వలన తెలుస్తాయి. కణపరీక్షలు :-

మూత్రముకుళములలో  కేశనాళికగుచ్ఛముల వ్యాధుల (glomerular diseases) సంశయము ఉన్నపుడు మూత్రాంగముల కణపరీక్ష  (biopsy) చేయాలి. చికిత్స :-

దీర్ఘకాల మూత్రాంగవ్యాధిని (chronic kidney disease) నిర్ణయించాక అది ఏ దశలో ఉన్నదో కూడా నిర్ణయించాలి. వ్యాధిని అదుపులో పెట్టుటకు తొలిగా మూత్రాంగవ్యాధిని కలుగజేసిన రక్తపీడనము, మధుమేహవ్యాధి, స్వయంప్రహరణ వ్యాధులను (autoimmune dis:: 248 ::