పుట:Hello Doctor Final Book.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూచిస్తాయి. మూత్రములో ఆల్బుమిన్ ప్రమాణముల బట్టి కూడా వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు. వ్యాధి లక్షణములు :-

మూత్రాంగవ్యాధి లక్షణములు మూత్రాంగవ్యాపారము బాగా క్షీణించే వఱకు (నాలు గైదు దశల వఱకు) వ్యాధిగ్రస్థులకు కనిపించవు.

కాని దీర్ఘకాల మూత్రాంగవ్యాధి మూడవ దశలో ఉన్నపుడు అధిక రక్తపుపోటు (hypertension), పాండురోగము (anaemia), ఖనిజ లవణముల సంబంధిత ఎముకల వ్యాధులు (mineral bone disorders - Renal osteodystrophy, Secondary hyperparathyroidism) పొడచూపవచ్చును. అవి పొడచూపినపుడు పరీక్షలతో మూత్రాంగవ్యాధికి శోధించాలి.

వ్యాధి నాలుగు, ఐదు దశలలో ఉన్నపుడు రక్త ము లో యూరియా విలువలు పెరుగుట వలన నీరసము, ఆకలి మందగించుట, వాంతి భావన, వాంతులు, కాళ్ళలో పొంగు కనిపించవచ్చును. బరువు తగ్గుట, కండరములు సన్నగిల్లుట కనిపించవచ్చును. యూరియా విలువలు బాగా హెచ్చయితే  యూరియా చెమటలో విసర్జింపబడి చెమట ఆవిరి అయిన పిదప చర్మముపై  యూరియా తెల్లని పొడిగా (urea frost) కనిపిస్తుంది. రక్తము ఆమ్లీకృతమయితే (metabolic acidosis) శ్వాసవేగము పెరుగుతుంది. యూరియా విలువలు బాగా పెరిగినపుడు గందరగోళము, మతిభ్రమణము కలుగవచ్చును. పరీక్షలు :మూత్రపరీక్షలు :-

రక్త ము లో యూరియా, క్రియటినిన్ విలువలు పెరిగి మూత్రాంగవ్యాధిని సూచిస్తాయి. పరీక్షలతో మూత్రములో ఎఱ్ఱ క ణములు (erythrocytes), తెల్లకణములు (leukocytes), రక్తము (hematuria), మూసలు (casts), మాంసకృత్తులకై శోధించాలి. మూత్రములో ఆల్బుమిన్

247 ::