పుట:Hello Doctor Final Book.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

membranoproliferative glomerulonephritis, nephrotic syndrome, post infectious glomerulonephritis) దీర్ఘకాల మూత్రాంగవ్యాధి (chronic kidney disease ) కలుగజేయగలవు.

జన్యుపరముగా వచ్చే బహుళ బుద్బుద మూత్రాంగవ్యాధి (polycystic kidney disease) మూత్రాంగవైఫల్యమునకు దారితీయవచ్చును.

కొంతమందిలో తెలియని కారణాల (idiopathic) వలన మూత్రాంగవైఫల్యము కలుగుతుంది. దీర ్ఘకాల మూత్రాంగ వ్యాధి దశలు :-

మూత్ర ముకుళములలోని కేశనాళికాగుచ్ఛముల  వడపోత ద్రవప్రమాణము (Glomerular filtration rate - GFR) బట్టి దీర్ఘకాల మూత్రాంగవ్యాధిని 5 దశలుగా విభజిస్తారు.

రక్తములో క్రియటినిన్ విలువలు స్థిరముగా ఉన్నపుడు GFR ను క్రింద సూత్రముతో  అంచనా చేస్తారు.

కేశనాళికాగుచ్ఛముల వడపోత ద్రవప్రమాణము (GFR) ml / minute / 1.73 m2 = (140 - వయస్సు) x (కిలోలలో ఉండవలసిన బరువు) / (72 x రక్తద్రవములో క్రియటినిన్ ప్రమాణము మి.గ్రా / డె.లీ) x (0.85 స్త్రీలలో).

వడపోత ద్రవప్రమాణము (GFR) బట్టి వ్యాధిని ఐదు దశలుగా విభజిస్తారు. మొదటి దశలో వడపోత ద్రవప్రమాణము (GFR) 90 మించి ఉంటుంది.  

రెండవ దశలో  GFR 60 - 89, మూడవ దశలో 30 - 59, నాల్గవ దశలో 15 - 29, ఐదవ దశలో 15 కంటె తక్కువ ఉంటుంది

మొదటి రెండు దశల మూత్రాంగ వ్యాధిలో కేశనాళికాగుచ్ఛముల వడపోత ప్రమాణములు సామాన్య పరిమితులలో ఉన్నా మూత్రములో మాంసకృత్తులు (Proteinuria & albuminuria), మూత్రములో రక్తము (hematuria) మూత్రాంగ నిర్మాణ, వ్యాపారములలో మార్పులను

246 ::