పుట:Hello Doctor Final Book.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22. దీర ్ఘకాల మూత్రాంగవ్యాధి ( Chronic Kidney disease ) శరీరములో వివిధ అవయవముల కణజాలములలో జరిగే జీవవ్యాపార ప్రక్రియ వలన (metabolism) వ్యర్థపదార్ధములు ఉత్పత్తి అయి రక్తములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థపదార్థములను రక్తమునుంచి ఎప్పటి కప్పుడు తొలగించి రక్తమును శుద్ధిచేసి శరీరావయవములను పరిరక్షించి శరీరవ్యాపారమును ఆరోగ్యకరముగా నడిపించుట చాలా అవసరము. జంతుజాలములోను, పక్షులలోను ఆ బాధ్యత   మూత్రాంగములు (Kidneys) నిర్వహిస్తాయి.

వివిధ వ్యాధుల వలన మూత్రాంగముల నిర్మాణములో మార్పులు కలిగి వ్యాపారము నెలలు, సంవత్సరాలలో మందగిస్తే దానిని దీర్ఘకాల మూత్రాంగవ్యాధి (Chronic Kidney Disease  CKD) లేక దీర్ఘకాల మూత్రాంగవైఫల్యముగా ( Chronic renal failure ) పరిగణిస్తారు. దీర ్ఘకాల మూత్రాంగవ్యాధికి కారణములు :-

దీర్ఘకాల మూత్రాంగవ్యాధి (వైఫల్యము) ఎక్కువ శాతము మందిలో శరీరపు ఇతర రుగ్మతల వలన కలుగుతుంది. అధిక రక్తపీడనము (hypertension), మధుమేహవ్యాధి (diabetes mellites), స్వయంప్రహరణ వ్యాధులు (autoimmune diseases  ex ; Systemic Lupus Erythematosus) కలవారిలో దీర్ఘకాల మూత్రాంగవ్యాధి పొడచూపవచ్చును. వయోజనులలో అధిక రక్త పు పోటు కలవారిలో 20 శాతము మంది లోను  మధుమేహవ్యాధి కలవారిలో 30 శాతము మందిలోను దీర్ఘకాల మూత్రాంగవైఫల్యము కనిపిస్తుంది.

మూత్రాంగములలో కలిగే వ్యాధులు మూత్రాంగవైఫల్యమునకు దారితీయగలవు. మూత్రముకుళములలో (renal corpuscles) కేశనాళికా గుచ్ఛ వ్యాధులు (glomerular diseases; IgA nephropathy,

245 ::