పుట:Hello Doctor Final Book.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(phosphate binding agents - calcium carbonate, calcium acetate, aluminum hydroxide, sevelamer hydrochloride) వాడి వాటిని అదుపులో తేవలెను.

మూత్రాంగవిఘాతము కల రోగులలో రక్తపీడనము కొద్దిగా పెరుగుతే (ముకుళిత పీడనము 150 - 160 mmhg లోపు) దానికి చికిత్సలు చేయకూడదు. రక్తపీడనము తీవ్రముగా పెరిగినవారికి సగటు ధమనీ పీడనము (mean arterial pressure) 10- 15 శాతము తగ్గించుటకు చికిత్స అవసరము. వీరిలో ACE inhibitors, ARBs వాడకూడదు.

మూత్రాంగవిఘాతము కలిగిన వారిలో మందుల విసరన ్జ తగ్గుతుంది కాబట్టి అవసరమయిన మందుల మోతాదులను సవరించాలి. అనవసరపు మందులు వాడకూడదు. వీరిలో నిరూపితము కాని ఔషధములు చికిత్సలో వాడకూడదు. అవి మూత్రాంగములపై కలిగించు శ్రమ వలన, మూత్రాంగములపై వాటి విషప్రభావము ( toxicity ) వలన కలిగే నష్టమే ఎక్కువ. మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స (Renal replacement therapy ; Dialysis) :సత్వర మూత్రాంగవిఘాతమునకు గుఱియగు వారిలో కొందఱికి మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స అవసరము కావచ్చును. 1) 2) 3) 4) 5)

విశేషమైన అరుచి, వాంతికలిగే భావన, మందులకు తగ్గని వాంతులు పెక్కు దినములు ఉన్నవారికి, ఔషధములకు తగ్గని ప్రమాదకర రక్తద్రవపు పొటాసియమ్ (serum potassium) విలువలు కలవారికి, మూత్రకారకములకు (diuretics) తగ్గని ద్రవభారము (fluid overload) కలవారికి, రక్తము ప్రమాదకరముగా ఆమ్లీకృతము (acidosis) అయినవారికి,

యూరియా వంటి వ్యర్థపదార్థములు ఎక్కువగా పెరిగి  మతిభ్రమణము,

243 ::