పుట:Hello Doctor Final Book.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రసము, బంగాళదుంపలు, కొబ్బరినీళ్ళలో పొటాసియము ఎక్కువగా ఉంటుంది. వీటిని వాడకూడదు.

పొటాసియమ్ విలువలు ప్రమాదకర ప్రమాణములలో ఉండి (6 meq / dL మించి), విద్యుత్ హృల్లేఖనములో (electro cardiogram) మార్పులు ఉంటే, హృదయ రక్షణకు కాల్సియమ్ గ్లూకొనేట్ (calcium gluconate) సిరల ద్వారా ఇస్తారు. రక్తద్రవములోని పొటాసియమును కణముల లోపలకు మళ్ళించుటకు ఇన్సులిన్ + గ్లూకోజుల మిశ్రమమును సిరలద్వారా ఇస్తారు. బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములను (beta adrenergic receptor agonists) పీల్పుసాధనముల ద్వారా ఇచ్చి పొటాసియమ్ ను కణములలోనికి మళ్ళించవచ్చును. రక్తము ఆమ్లీకృతము అయితే (acidosis) సోడియమ్ బైకార్బొనేట్ (sodium bicarbonate) కూడా ఇవ్వవచ్చును. ఆపై శరీరములో పొటాసియమును తగ్గించుటకు sodium polystyrene sulfonate  వంటి ఋణపరమాణు వినిమయ ఔషధములు (cation echange resins) వాడవలెను. ద్రవపరిమాణ లోపము (hypovolemia) లేనివారిలో మూత్రకారకములు వాడి పొటాసియము విసర్జనను పెంచవచ్చును. రక్తము ఆమ్లీకృతమయితే (acidosis) నోటిద్వారా సోడియమ్ బైకార్బొనేట్ యిచ్చి దానిని సవరించవచ్చును. ఆమ్లీకృతము తీవ్రముగా ఉండి రక్తపు pH 7.2 కంటె తక్కువగా ఉన్నపుడు సోడియమ్ బైకార్బొనేట్ సిరలద్వారా ద్రావణములతో ఇవ్వవచ్చును. కాని దాని వలన ద్రవభారము (fluid overload) కలుగకుండా, రక్తద్రవపు కాల్సియమ్ విలువలు పడిపోకుండా, రక్తము క్షారీకృతము (alkalosis) కాకుండాను తగు జాగ్రత్తలు తీసుకోవాలి. {ధమని రక్తపు pH 7.37 నుంచి 7.43 వఱకు ఉంటుంది. pH 7.37 కంటె తక్కువైతే ఆమ్లీకృతము (acidosis) గాను, 7.43 కంటె ఎక్కువైతే క్షారీకృతము (alkalosis) గాను పరిగణిస్తారు.}

రక్తములో ఫాస్ఫేట్ విలువలు పెరుగుతే ఫాస్ఫేట్ బంధకములను

242 ::