పుట:Hello Doctor Final Book.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుగమము చేయుట వలన మూత్రాంగములపై పీడనము తగ్గి మూత్ర విఘాతమును నిలువరించగలుగుతాము. మూత్రాంగ కారణములకు చికిత్స :-

మూత్రాంగములపై విషప్రభావము కలిగించు ఔషధములను (aminoglycosides, cisplatin, amphoterin-b) తప్పనిసరి కాకపోతే వెంటనే నిలిపివేయాలి. కండర విచ్ఛేదనము (rhabdomyolysis) జరిగిన వారికి సిరల ద్వారా లవణ ద్రావణము (normal saline) ఇచ్చి మూత్రపరిమాణము పెంచి కండరవర్ణకము (myoglobin) మూత్రనాళికలలో (tubules) పేరుకుపోకుండా చెయ్యాలి. మూత్రాంగముల కేశనాళికగుచ్ఛములలో (glomeruli) వ్యాధి కలిగించు స్వయంప్రహరణ వ్యాధులను (autoimmune disease) ఇతర కొల్లజెన్ రక్తనాళిక వ్యాధులను (collgen vascular diseases) కనుగొని వాటికి తగిన చికిత్సలు చెయ్యాలి.

జలోదరము (ascites) వలన ఉదరకుహరములో పీడనము అధికముగా ఉంటే ఉదరకుహరములో ద్రవమును తొలగించాలి.

కారణములను పరిష్కరిస్తే మూత్రాంగములు విఘాతము నుంచి కోలుకొనే అవకాశము ఉంటుంది. మూత్రాంగవిఘాతము వలన కలిగే ఉపద్రవముల పరిష్కారము :-

ఇది చికిత్సలో చాలా ముఖ్యాంశము. మూత్రాంగవిఘాతము వలన వ్యాధిగ్రస్థులకు అరుచి కలిగి తగినంత ద్రవములు నోటితో తీసుకోలేకపోతే రక్తపరిమాణ లోపమును (hypovolemia), జలక్షీణతను (dehydration) సరిదిద్దుటకు సిరల ద్వారా లవణ ద్రావణములు ఇయ్యాలి. శరీర ద్రవభారము (fluid overload) అధికమయితే మూత్రకారకములతో (diuretics) దానిని పరిష్కరించాలి. రక్త ద్ర వపు పొటాసియమ్ (serum Potassium) విలువలు అధికమయితే ఆహారములో పొటాసియమ్  తగ్గించాలి. అరటిపళ్ళు, నారింజ

241 ::