పుట:Hello Doctor Final Book.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూత్రాంగపూర్వ కారణముల పరిష్కరణ :-

శరీరపు జలక్షీణతను (dehydration), రక్తపరిమాణ లోపములను (hypovolemia) దిద్దుబాటు చేసి మూత్రాంగముల రక్తప్రసరణ లోపమును సరిదిద్దాలి. దేహములో నీరు, ఉప్పు (sodium chloride) ఒకదానితో మరొకటి అనుబంధము కలిగి ఉంటాయి. అందువలన శరీరపు ఆర్ద్రత తగ్గినపుడు లవణ ద్రావణము  (normal saline) సిరల ద్వారా ఎక్కించి ఆర్ద్రక్షీణతను (dehyration) సరిదిద్దాలి. రక్తహీనము (anemia) ఎక్కువగా ఉంటే రక్తకణ సముదాయము (packed redblood cells) ఎక్కించాలి. నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో (cirrhosis of liver) రక్తములో ఆల్బుమిన్ (albumin) బాగా తగ్గి జలోదరము (ascites) ఉంటే ఆల్బుమిన్  సిరలద్వారా ఇవ్వాలి.

మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గించు తాపహరముల (nonsteroidal antiinflammatory agents) వంటి ఔషధములను ఆపివేయాలి. శరీర ఆర్ద్రత తగ్గినపుడు మూత్రకారకములు (diuretics) ఆపివేయాలి. రక్తద్రవములో క్రియటినిన్ (serum creatinine) విలువలు 50 శాతము కంటె పెరుగుతే  Angiotensin Converting Enzyme Inhibitors, Angiotensin Receptor Blockers  మోతాదులను తగ్గించాలి. లేక పూర్తిగా మానివేయాలి. రక్తపీడనము తగ్గిన వారిలో (hypotension) రక్తపుపోటు మందులు తగ్గించాలి, లేక నిలిపివేయాలి. మూత్రాంగపర కారణముల పరిష్కరణ :-

మూత్రవిసర్జనకు, మూత్రప్రవాహమునకు అవరోధములు ఉంటే వాటిని పరిష్కరించాలి. మూత్రాశయములో కృత్రిమనాళము అమర్చి మూత్రప్రవాహము సుగమము చేయాలి. మూత్రనాళములలో శిలలు ఉంటే వాటిని తొలగించాలి. మూత్రాశయమునకు (urinary bladder) ఎగువ తొలగించలేని ఇతర అవరోధములు ఉంటే మూత్రకుండికకు (renal pelvis) శస్త్రచికిత్సతో కృత్రిమ ద్వారము (nephrostomy) బయటకు అమర్చి మూత్ర విసర్జనకు సదుపాయము కల్పించాలి. మూత్ర ప్రవాహము

240 ::