పుట:Hello Doctor Final Book.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

gravity) 1.020  కంటె ఎక్కువగా ఉంటుంది ; మూత్రపు ఆస్మలాలిటీ (urine osmolality) 500 mOsm/kg కంటె ఎక్కువగా ఉంటుంది. మూత్రములో సోడియమ్ సాంద్రత 10 meq / L లోపల ఉంటుంది.

మూత్రములో ఎఱ్ఱకణముల మూసలు (erythrocyte casts), ఎఱ్ఱకణములు, మాంసకృత్తులు (proteins) ఉంటే అవి కేశనాళికల గుచ్ఛములలో (glomeruli) వ్యాధిని సూచిస్తాయి. వారికి వివిధ స్వయం ప్రహరణ వ్యాధులకు (autoimmune diseases), రక్తనాళికల తాపము (vasculitis)  కలిగించే కాలేయతాపములు ఎ, బి లకు (hepatitis B & C) పరీక్షలు చెయ్యాలి. శ్రవణాతీత ధ్వని చిత్రీకరణము ( ultrasonography ) :-

శ్రవణాతీతధ్వని చిత్రీకరణములతో  (ultrasonography), మూత్రనాళ శిలలను (ureteric calculi), ఇతర అవరోధములను, మూత్రాశయములో వైపరీత్యములను, ప్రాష్టేట్ పెరుగుదలలను, అవరోధము వలన ఉబ్బిన మూత్రనాళములు (ureters), ఉబ్బిన మూత్రకుండిక (మూత్రపాళియ; renal pelvis) మూత్రకుండిక ముఖద్వారములతో (calyces of  kidneys) జలమూత్రాంగమును (hydronephrosis),కటిస్థలములో (pelvis) పెరుగుదలలను కనుగొనవచ్చును. చికిత్స :

మూత్రాంగ విఘాతపు చికిత్స రెండు భాగములు. ప్రధమముగా మూత్రాంగ విఘాతానికి కారణములను పరిష్కరించాలి. అదేసమయములో మూత్రాంగ విఘాతము వలన కలిగిన ఉపద్రవములను కూడా పరిష్కరించాలి. మూత్రాంగవిఘాత కారణముల పరిష్కరణ :-

మూత్రాంగపూర్వ కారణములను, మూత్రాంగపర కారణములను సత్వరముగా పరిష్కరించుట వలన మూత్రాంగ విఘాతమును నిలువరించ గలుగుతాము.

239 ::