పుట:Hello Doctor Final Book.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాంసకృత్తులు (proteinuria) కేశనాళికాగుచ్ఛముల వ్యాధిని (glomerular disease) సూచిస్తాయి.

తెల్లకణముల మూసలు (leukocyte casts, ఆమ్లాకర్షణ కణములు (eosinophils) మూత్రాంగములలో అంతరకణజాల తాపమును (Interstitial nephritis) సూచిస్తాయి.

మూత్రములో రక్తవర్ణకము ఉండి, రక్తకణములు లేకపోతే ఆ వర్ణకము కండరవర్ణకము (myoglobin) కావచ్చును. అది కండరములు విచ్ఛిన్నతను (Rhabdomyolysis)  సూచిస్తుంది.

మూత్రమును సూక్ష్మదర్శినితో పరీక్షించునపుడు యూరికామ్లపు స్ఫటికములు (uric acid crystals), యితర స్ఫటికములు (ethylene glycol,) కనిపిస్తే వ్యాధి కారణములు తెలుసుకొనవచ్చును. రక ్తపరీక్షలు

రక్తపరీక్షలలో యూరియా, క్రియటినిన్ ల ప్రమాణములు పెరుగుతాయి. యూరియా, క్రియటినిన్ లతో విద్యుద్వాహక లవణములు (electrolytes) సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేట్, కాల్సియమ్, ఫాస్ప్ ట్, యూరికామ్లముల విలువలు, చక్కెర, ఆల్బుమిన్ విలువలు, రక్తకణముల విలువలు వైద్యులు పరిశీలిస్తారు. మూత్రాంగపూర్వ (prerenal) మూత్రాంగ విఘాతములలో రక్తములో యూరియా/క్రియటినిన్ నిష్పత్తి 20:1 కంటె హెచ్చుగా ఉంటుంది. మూత్రాంగ (కారణ) మూత్రాంగ విఘాతములలో ఈ నిష్పత్తి 20:1 కంటె తక్కువగా ఉంటుంది. మూత్రములో సోడియమ్, క్రియటినిన్ విలువలు, ఆస్మొలాలిటీ (osmolality) కూడా తెలుసుకోవాలి.

మూత్రాంగపూర్వ మూత్ర్రాంగ విఘాతములలో రక్తప్రమాణము తగ్గుట వలన శరీరములో వినాళగ్రంథులు స్పందించి నీటిని, సోడియమ్ ను పదిల పఱుస్తాయి. అందుచే మూత్రపు సాపేక్ష సాంద్రత (specific

238 ::