పుట:Hello Doctor Final Book.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5)

6)

7)

8)

9)

ఎసైక్లొవీర్ (acyclovir), ఇండినవీర్, సల్ఫానమైడులు వంటి ఔషధములు కూడా మూత్రనాళికలలో పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ విఘాతమును కలిగించవచ్చును.

రక్తనాళ పరీక్షలు, చికిత్సలలో (vascular procedures), ప్రమాద వశమున ధమనీ ఫలకములు (atheromas) ఛిద్రమయి రక్త ప్రవాహములో మూత్రాంగములకు చేరి మూత్రాంగ విఘాతమును కలిగించగలవు. అస్థికండర కణవిచ్ఛేదనము (Rhabdomyolysis) జరిగిన వారిలో కండర వర్ణకము (myoglobin) విడుదలయి మూత్రనాళికలలో పేరుకుంటే మూత్రాంగ విఘాతము కలుగవచ్చును. స్వయంప్రహరణ వ్యాధులు (autoimmune diseases) వలన కేశనాళికా గుచ్ఛములలో (glomeruli)  తాపము (glomerulo nephritis) కలిగి మూత్రాంగ విఘాతము కలిగించవచ్చును.

కొన్ని వ్యాధుల వలన, కొన్ని ఔషధముల వలన మూత్రాంగము లలో మూత్రాంకముల (nephrons) మధ్యనుండు కణజాలములో తాపము (interstitial nephritis)  కలిగి మూత్రాంగవైఫల్యము కలిగించవచ్చును.

మూత్రాంగ విఘాతములను రెండుగా విభజించవచ్చును. దినమునకు 500 మి.లీ లోపు మూత్రమును విసర్జిస్తే మితమూత్ర మూత్రాంగ విఘాతము (oliguric AKI). 500 మి.లీ కంటె ఎక్కువగా మూత్ర విసర్జన ఉంటే అది అమిత మూత్ర మూత్రాంగ విఘాతము (non oliguric AKI ). మితమూత్ర మూత్రాంగ విఘాతము తీవ్రమైనది. మూత్రాంగ పర ( మూత్రాంగములు తర్వాత) కారణములు ( post renal causes) :మూత్రాంగములలో ఉత్పత్తి అయే మూత్ర ప్రవాహమునకు, విసరన ్జ కు అవరోధములు ఏర్పడితే మూత్ర నాళములలో పీడనము పెరిగి ఆ

235 ::