పుట:Hello Doctor Final Book.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీడనము వలన మూత్రాంగ విఘాతము కలుగుతుంది. వయస్సు పెరిగిన పురుషులలో ప్రాష్టేటుగ్రంథి (prostate gland) పెరుగుదలలు, పిల్లలలో జన్మసిద్ధముగా మూత్రపథములో కలుగు వైపరీత్యములు (congenital urinary tract abnormalities), మూత్రపథములో శిలలు (calculi in urinary tract), కటిస్థలములో కర్కటవ్రణములు మూత్ర ప్రవాహమునకు అవరోధము కలిగించి సత్వర మూత్రాంగ విఘాతమునకు (acute kidney injury) దారితీయగలవు. సత్వర మూత్రాంగ విఘాత లక్షణములు :-

మూత్రాంగ విఘాతము వలన మూత్రంగవ్యాపారము మందగించి రక్తములో యూరియా (urea), క్రియటినిన్ (creatinine) వంటి వ్యర్థపదార్థముల పరిమాణములు త్వరితముగా పెరుగుతాయి. అందువలన వ్యాధిగ్రస్థులలో ఒంట్లో నలత, అరుచి, వాంతి కలిగే వికారము, వాంతులు, నీరసము, అలసట, కలుగుతాయి. తలనొప్పి ఉండవచ్చును. మూత్రాంగములలో తాపముచే మూత్రాంగముల పరిమాణము పెరుగుతే వాటిని ఆవరించు ఉండు పీచుపొర సాగుట వలన ఉదరములో పార్శ్వభాగములలో నొప్పి కలుగవచ్చును. మూత్రాంగ విఘాతమునకు మూలకారణముల వలన యితర లక్షణములు కలుగుతాయి:-  శరీర ఆర్ద్రత తగ్గుట (dehydration), రక్త ప్రమాణము తగ్గుట (hypovolemia) వలన మూత్రాంగ విఘాతము కలిగిన వారిలో దాహము పెరుగుట, నోరు పిడచకట్టుకొనుట, శరీరస్థితి మార్పులతో, (పడుకొన్నవారు, కూర్చున్నపుడు, లేచి నిలుచున్నపుడు) రక్తపీడనము తగ్గి (postural hypotension) కళ్ళు తిరుగుట, ఒళ్ళు తూలుట కలుగవచ్చును. శరీరస్థితితో ధమనివేగములో మార్పులు కలుగుతాయి. వీరిలో నాలుక, నోటి శ్లేష్మపుపొరలలోను (mucosa), చర్మములోను ఆర్ద్రత (తడి) తగ్గి పొడిగా కనిపిస్తాయి. గుండెవేగము పెరుగుతుంది. రక్తపీడనము తక్కువగా ఉండవచ్చు. నిలుచున్నపుడు రక్తపీడనము తగ్గుతుంది. సూక్ష్మజీవుల వలన రక్తము విషమయము అయితే (bacterial

236 ::