పుట:Hello Doctor Final Book.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వైఫల్యము కలుగుతుంది. మూత్రాంగ కారణములు ( Renal parenchymal causes ) :-

సత్వర మూత్రాంగ వైఫల్యమునకు కారణములు మూత్రాంగముల (Kidneys) లోనే ఉండవచ్చును. 1)

2)

3)

4)

సత్వర మూత్రనాళికా కణధ్వంసము (acute tubular necrosis) : మూత్రాంకముల నాళికలలో (tubules of nephrons) కణముల విధ్వంసము జఱిగి సత్వర మూత్రాంగ విఘాతము కలుగవచ్చును. సూక్ష్మజీవులు శరీరమును ఆక్రమించుకొనుట వలన రక్తము సూక్ష్మజీవ విషమయము (bacterial sepsis) అయితే అది మూత్రనాళికల కణవిధ్వంసమునకు దారి తీయవచ్చును.

మూత్రాంగ విషములు (nephrotoxins), వేంకోమైసిన్ (vancomycin), జెంటామైసిన్  (Gentamicin), టోబ్రామైసిన్  (Tobramycin) వంటి ఎమైనోగ్లై కొ సైడ్ సూక్ష్మజీవి వినాశక ఔషధములు (amino glycoside antibiotics ), ఏంఫోటెరిసిన్ -బి (amphotericin B), సిస్ ప్లాటిన్ (cisplatin), సిరల ద్వారా ఇవ్వబడు  వ్యత్యాస పదార్థములు (I.V. contrast materials), ఇతర ఔషధముల వలన మూత్రనాళికలలో సత్వర కణధ్వంసము (acute tubular necrosis) కలుగవచ్చును.

లింఫోమా (lymphoma), లుకీమియా వంటి కర్కట వ్రణ (cancer) వ్యాధిగ్రస్థులలో రసాయనక చికిత్స పిదప కర్కటవ్రణ కణధ్వంసము (lysis of cancer cells) జరుగుటచే  రక్తములోను, మూత్రములోను యూరికామ్ల పు  (uric acid) విలువలు పెరిగి అవి మూత్రనాళికలలో (tubules) పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ వైఫల్యమును కలిగించగలవు. Multiple myeloma వ్యాధిగ్రస్ల థు లో ఇమ్యునోగ్లాబ్యులిన్ల భాగములు మూత్రనాళికలలో పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ విఘాతము కలిగించవచ్చును.

234 ::