పుట:Hello Doctor Final Book.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూత్రాంగ పూర్వ ( మూత్రాంగములకు ముందు ఉండు ) కారణములు (Pre renal causes ) :-

మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుట వలన మూత్రాంగవైఫల్యము, మూత్రాంగ విఘాతము కలుగగలవు. వాంతులు, విరేచనములు, రక్తస్రావము (hemorrhage) వలన ఇతర కారణముల వలన రక్త ప్రమాణము తగ్గితే (hypovolemia) మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది.

హృదయవైఫల్యము (Congestive Heat Failure), కాలేయ వైఫల్యము (Hepatic Failure), నెఫ్రాటిక్ సిండ్రోమ్ లలో (Nephrotic syndrome) శరీర ద్రవప్రమాణము పెరిగినా, వివిధ అవయవాలకు సమర్థవంతముగా ప్రసరించు రక్తప్రమాణము (effective circulatory volume) తగ్గి మూత్రాంగములకు కూడా రక్తప్రసరణ తగ్గుతుంది. ఉదర శస్త్రచికిత్సల తర్వాత శరీర ద్రవములు కణజాలముల (Tissues) లోనికి ఎక్కువగా చేరుట వలన అవయవాలకు ప్రసరించు రక్త ప్రమాణము తగ్గుతుంది. నారంగ కాలేయవ్యాధిలో (cirrhosis of Liver) ఉదరకుహరములో (peritoneal cavity) ద్రవము చేరుకొని జలోదరమును (ascites) కలిగించునపుడు కూడా సమర్థముగా ప్రసరించు రక్త పరిమాణము (effective circulating volume) తగ్గుతుంది. జలోదరము (ascites) విశేషముగా ఉండి ఉదరకుహరములో పీడనము ఎక్కువయినపుడు మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది. మూత్రసిరల నుంచి ప్రసరించు రక్త ప్రమాణము కూడా తగ్గుతుంది. కాలేయ వ్యాధుల వలన సత్వర కాలేయవైఫల్యము (acute hepatic failure ) కలగిన వారిలో hepatorenal syndrome కలుగుతే మూత్రాంగ ధమనులు సంకోచిస్తాయి. మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది.

మూత్రాంగములకు రక్తప్రసరణ లోపించుట వలన మూత్రాంగముల నిర్మాణ, వ్యాపారములలో మార్పులు జరిగి సత్వర మూత్రాంగ విఘాతముగా (acute Kidney Injury) పరిణమించవచ్చును దాని వలన సత్వర మూత్రాంగ

233 ::