పుట:Hello Doctor Final Book.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21. సత్వర మూత్రంగ విఘాతము ( Acute Kidney Injury ) శరీరములో వివిధ అవయవముల కణజాలములో జరిగే జీవవ్యాపార ప్రక్రియలో (metabolism) వ్యర్థపదార్ధములు ఉత్పత్తి అయి రక్తములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థ పదార్థాలను రక్తము నుంచి ఎప్పటి కప్పుడు తొలగించి రక్తమును శుద్ధిచేసి శరీర అవయవములను పరిరక్షించి శరీరవ్యాపారమును ఆరోగ్యకరముగా నడిపించుట చాలా అవసరము. జంతుజాలములోను పక్షులలోను ఆ బాధ్యత మూత్రాంగములు (Kidneys) నిర్వహిస్తాయి. మూత్రాంగములు వివిధ కారణముల వలన ఘాతములకు (injuries & insults) లోనయితే వాటి నిర్మాణములో మార్పులతో పాటు  వాటి వ్యాపారము కూడా మందగించవచ్చును. ఈ మూత్రాంగ విఘాతము తక్కువ కాలములో త్వరగా (7 దినములలో) కలిగితే దానిని  సత్వర మూత్రాంగ విఘాతము (Acute Kidney Injury) లేక సత్వర మూత్రాంగ వైఫల్యముగా (Acute Renal Failure)  పరిగణిస్తారు.

తక్కువ సమయములో రక్తద్రవము లో  క్రియటినిన్ (serum creatinine) ప్రమాణములు పెరుగుట కాని, మూత్రవిసర్జన (urine output) పరిమాణము బాగా తగ్గుట కాని సత్వర మూత్రాంగ విఘాతమును సూచిస్తాయి. కారణములు :-

సత్వర మూత్రాంగ విఘాతమునకు (Acute Kidney Injury) కారణములు మూత్రాంగములకు ముందు గాని (Pre renal ), మూత్రాంగములలో గాని (Renal parenchyma), మూత్రాంగముల తరువాత గాని )Post renal) ఉండవచ్చును.

232 ::