పుట:Hello Doctor Final Book.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాలా భాగపు నీరు, విద్యుద్వాహక లవణములు (electrolytes), గ్లూకోజు, ఎమైనో ఆమ్లములు (amino acids ), మూత్రనాళికల నుంచి మూత్రాంగముల అంతర కణజాలము (interstitial tissue) లోనికి, ఆపై మూత్రనాళికలను అనుసరించు రక్తకేశనాళికల లోని రక్తము లోనికి మఱల గ్రహించబడుతాయి.

వయోజనులలో మూత్రాంగములు (Kidneys) దినమునకు సుమారు 180 లీటరులు వడపోత ద్రవమును ఉత్పత్తి చేస్తాయి. ఇందులో తిరిగి సుమారు 178- 178.5 లీటరుల నీరు తిరిగి రక్తములోనికి గ్రహించబడి 1.5 - 2 లీటరులు మాత్రము మూత్రముగా విసర్జింపబడుతుంది. వడపోత ద్రవపు సాంద్రీకరణ (concentration) చాలా భాగము మూత్రనాళికల దిగు మెలికలలో (అవరోహిక భుజములు; descending limbs of loops of Henle), జరుగుతుంది. శరీర వ్యాపార క్రియలో జనితమయే యూరియా (urea), యూరికామ్లము (uric acid), క్రియటినిన్ (creatinine) వంటి వ్యర్థపదార్థములు సాంద్రీకరింపబడి తక్కువ నీటితో మూత్రముగా విసర్జింపబడుతాయి. మూత్రాంగములు వ్యర్థపదార్థములను విసర్జించు ప్రక్రియ చాలా క్లిష్టమైనది, సమర్థవంతమైనది. మూత్రాంగముల వైఫల్యము గురించి వేఱే వ్యాసములలో చర్చిస్తాను.

231 ::