పుట:Hello Doctor Final Book.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోనికి ప్రవేశిస్తుంది.

మూత్రనాళికల తొలిభాగము చుట్టగా ఉంటుంది (proximal convoluted tubule ). తర్వాత భాగము  చెంపపిన్ను వలె ఒక మెలిక  (loop of Henle) కలిగి ఉంటుంది. మెలికలో తొలిభాగము  మూత్రాంగ అంతర్భాగము (medulla) లోనికి దిగుమెలికగా (అవరోహి భుజము;descending limb of loop of Henle) దిగి, తిరిగి వెనుకకు ఎగుమెలికగా (ఆరోహి భుజము; ascending limb of loop of Henle) మూత్రాంగపు వెలుపలి భాగము (cortex) లోనికి వచ్చి మరల మరో చుట్టగా (తుదిచుట్ట/distal  convoluted tubule) ఉంటుంది. ఈ తుదిచుట్ట సమీపములో ఉన్న సమీకరణ నాళము (collecting duct) లోనికి  ప్రవేశిస్తుంది. సమీకరణ నాళములు మూత్రమును మూత్రకుండికకు(మూత్రపాళియ ; renal pelvis) చేరుస్తాయి. మూత్రకుండిక నుంచి మూత్రము మూత్రనాళముల(ureters) ద్వారా మూత్రాశయమునకు చేరుతుంది.

మూత్రనాళికలలో (renal tubules) వడపోత ద్రవము ప్రవహించునపుడు

230 ::