పుట:Hello Doctor Final Book.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బృహద్ధమని (aorta) శాఖ అయిన ముత్రాంగధమని (Renal artery ) నాభి ద్వారా ప్రవేశించి మూత్రాంగమునకు రక్తప్రసరణను చేకూర్చుతుంది. మూత్రాంగ నాభి నుంచి మూత్రంగసిర (Renal vein) వెలువడి రక్తమును అధోబృహత్సిరకు (Inferior venacava) చేర్చుతుంది. మూత్రాంగములనుంచి వెలువడు మూత్రనాళములు (Ureters) దిగువకు పయనించి శరీరపు కటిస్థలములో (Pelvis) ఉండు మూత్రాశయమునకు (urinary bladder) మూత్రమును చేరుస్తాయి. మూత్రాశయములో మూత్రము నిండుతున్నపుడు దాని గోడలో కల మృదుకండరము (detrusor muscle) సాగి  మూత్రాశయపు పరిమాణము పెరుగుటకు సహకరిస్తుంది. మూత్రాశయము నిండినపుడు మూత్రము మూత్రద్వారము (urethra) ద్వారా విసర్జింపబడుతుంది.

228 ::