పుట:Hello Doctor Final Book.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

nal failure) కలుగవచ్చును. దీర్ఘకాల వ్యాధుల వలన దీర్ఘకాల  మూత్రాంగ వైఫల్యము (Chronic Renal failure) కలుగవచ్చును. వీని గురించి తరువాత చర్చిస్తాను. మూత్రాంగముల నిర్మాణము, వ్యాపారముల గురించి స్థూలముగా ఇపుడు వ్రాస్తాను.

మనుజులలో రెండు మూత్రాంగములు కుడి, ఎడమ ప్రక్కల ఉదరాంత్ర వేష్టనమునకు (peritoneum) వెనుక ఉంటాయి. ఇవి చిక్కుడు గింజల ఆకారములో ఉంటాయి. వయోజనులలో  ఒక్కక్కటి సుమారు 11 సెంటీమీటరుల పొడవు కలిగి ఉంటుంది. మూత్రాంగము వెలుపలపక్క కుంభాకారమును, లోపలప్రక్క పుటాకారమును కలిగి ఉంటుంది. లోపల మధ్యభాగములో ఉండు నాభి (hilum) నుంచి మూత్రనాళము (ureter) వెలువడుతుంది.

227 ::