పుట:Hello Doctor Final Book.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20. మూత్రాంగములు ( Kidneys ) శరీరములో వివిధ అవయవముల కణజాలములో జరిగే జీవవ్యాపార ప్రక్రియలో (metabolism) వ్యర్థపదార్ధములు ఉత్పత్తి అయి రక్తములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థపదార్థములను రక్తమునుంచి ఎప్పటి కప్పుడు తొలగించి రక్తమును శుద్ధిచేసి శరీర అవయవములను పరిరక్షించి శరీర వ్యాపారమును ఆరోగ్యకరముగా నడిపించుట చాలా అవసరము. జంతుజాలములోను పక్షులలోను ఆ బాధ్యత మూత్రాంగములు (kidneys) నిర్వహిస్తాయి. మూత్రాంగములలో రక్తము నిత్యము వడపోయబడి వ్యర్థ పదార్థములు నీటితో బాటు తొలగించబడుతాయి. వడపోత ద్రవము (filtrate) నుంచి దేహమునకు అవసరమయే చక్కెర (glucose), సోడియం, బైకార్బొనేట్, ఏమైనో ఆమ్లములు (aminoacids) వంటి పదార్థములు, ఎక్కువైన నీరు క్లిష్టమైన ప్రక్రియతో తిరిగి రక్తములోనికి గ్రహించబడుతాయి. మిగిలిన వడపోత ద్రవము వ్యర్థ పదార్థములతో మూత్రముగా విసర్జింపబడుతుంది. రక్తములో అధికమయిన పొటాసియమ్, ఉదజని (hydrogen), అమ్మోనియా, యూరికామ్లము (uric acid) మూత్రాంగములలో మూత్రములోనికి స్రవించబడుతాయి.

శరీరములో నీరు, విద్యుద్వాహక లవణములు (electrolytes), ఇతర  ఖనిజలవణముల పరిమాణములను, ఆమ్ల - క్షారకముల సమతుల్యతను (Acid- base balance) నిర్వహించుటలోను, రక్తపీడన నియంత్రణలోను మూత్రాంగములు ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి. రక్తోత్పాదిని (erythropoietin) అనే జీవోత్ప్రేరకము (enzyme) మూత్రాంగములలో ఉత్పత్తి అయి ఎముకల మజ్జలో ఎఱ్ఱరక్తకణముల ఉత్పాదనకు తోడ్పడుతుంది. మూత్రంగములు వివిధ కారణముల వలన సత్వర ఘాతములకు (acute insults ) లోనయితే సత్వర మూత్రాంగ వైఫల్యము ( Acute Re:: 226 ::