పుట:Hello Doctor Final Book.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

al symptoms) సమర్థవంతముగా చికిత్స చెయ్యాలి. మద్య వర్జన చికిత్సకు డయజిపామ్ (Diazepam), క్లోర్ డయజిపాక్సైడు (Chlordiazepoxide), లొరజిపామ్ (Lorazepam), ఆక్సజిపామ్ (Oxazepam) వంటి బెంజోడయజిపిన్స్ (Benzodiazepines) మగతనిద్ర కలిగించుటకు కావలసిన మోతాదులలో మొదలుపెట్టి  దినదినము మోతాదులను తగ్గించుకుపోతారు. హృదయవేగము, రక్తపీడనములు పెరిగిన వారిలో బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక అవరోధకములను (Beta adrenergic receptor blockers), క్లోనిడిన్ (clonidine) లను తక్కువ మోతాదులలో  వాడవచ్చును. కాని వీటిని వాడిన వారిలో మతిభ్రంశము (delirium) కలిగే అవకాశము ఎక్కువ. అలజడిని (agitation) అరికట్టుటకు హేలోపెరిడాల్ ( Haloperidol ) వాడవచ్చును. కాని హేలోపెరిడాల్ వాడిన వారిలో మూర్ఛ ( seizures) కలిగే అవకాశములు హెచ్చు.

మూర్ఛలు ఇదివరలో కలిగిన వారికి మద్యపాన విసర్జన తదనంతరము మూర్ఛలు, ఇతర లక్షణములు పొడచూపక మునుపే  దీర్ఘకాలము పనిచేసే బెంజోడయజిపిన్స్ (benzodiazepines) మొదలుపెట్టాలి. మద్యపానము మఱల మొదలపెట్టకుండా ఉండుటకు బహుళ శిక్షణ ప్రక్రియలు (multidisciplinary actions) అవసరము. వీరికి స్మృతివర్తన చికిత్సలు (cognitive behavioral therapy) మొదలు పెట్టాలి. త్రాగుట అధిగమించు నైపుణ్యములు అలవరచాలి. మద్యపానము విసర్జించాక కలిగే ఆందోళన, క్రుంగుదలలకు తగిన చికిత్స చెయ్యాలి. మద్యపానమును అరికట్టు ఔషధములు :నల్ ట్రెక్సోన్ ( Naltrexone ) :

మద్యపాన వ్యసన నివృత్తికి ఉపయోగకరమైన ఔషధము. ఇది ఓపియాయిడ్ గ్రాహక అవరోధకము (opioid receptor antagonist). ఈ ఔషధము మద్యముపై ఆసక్తిని తగ్గిస్తుంది. కాలేయతాపము ఉన్నవారి లోను, నల్లమందు సంబంధిత మందులు తీసుకొనేవారిలోను నల్ ట్రెక్సోన్ వాడకూడదు.

223 ::