పుట:Hello Doctor Final Book.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారి లక్ష్యములను నిర్ణయింప చేయుట, ఆ లక్ష్యములను సాధించుటలో తోడ్పడుట సలహాదారులు బాధ్యతగా తీసుకోవాలి. సలహాదారులు (counselors) ప్రతి పర్యాయము పది పదిహైను నిమిషములు వఱకు కాలము వెచ్చిస్తూ ఒక సంవత్సరము  కల్పించుకుంటే సత్ఫలితములు కలుగుతాయి.. విషహరణము ( Detoxification ) :-

ఇది మద్యపాన వ్యసన నివృత్తిలో ముఖ్యమైన భాగము. నిజానికి ఈ ప్రక్రియలో విషపదార్థములు ఏమీ తొలగించబడవు. కాని మస్తిష్కములో రసాయనముల మార్పుల వలన కలిగే హానికర పరిణామములకు పరిష్కరణ చేకూర్చబడుతుంది.

మద్యము మెదడులో ఉండే GABA-A (Gamma Amino Butyric Acid - A receptors) గ్రాహకములను ఉత్తేజపఱుస్తుంది . ఈ గ్రాహకములు (receptors) మెదడు వ్యాపారమును మందకొడి పరుస్తాయి. మద్యము వాడుతు ఉంటే  మద్యమునకు GABA-A గ్రాహకమముల స్పందన తగ్గుతుంది. అందువలన త్రాగేవారు ఉల్లాసానికి, మత్తుకు సారాయి ప్రమాణములను పెంచుకుపోతుంటారు. ఒక్కసారి వారు మద్యపానము మానివేసినపుడు మెదడుపై GABA-A గ్రాహకముల మందకొడి ప్రభావము తగ్గి డోపమిన్ (Dopamine), గ్లుటమేట్ (Glutamate), ఎన్ మిథైల్డి - ఏస్పర్టిక్ ఏసిడ్ (N- Methyl- D- Aspartic acid NMDA) వంటి మస్తిష్కమును ఉత్తేజపఱచే నాడీరసాయనముల (neurotransmitters) ప్రభావము పెరిగి గాభరా, ఆందోళన (anxiety), శరీరకంపనము (tremors), మూర్ఛ (seizures), మతిభ్రమలు (hallucinations), మతిభ్రంశము (delirium) కలుగుతాయి. మద్యము పరిత్యజించిన లక్షణములు సాధారణముగా మద్యము వీడిన 6 నుంచి 24 గంటలలో మొదలవుతాయి. తీవ్రస్థాయి మతిభ్రంశ కంపనము (Delirium tremens) మద్యమును విడనాడిన రెండు మూడు దినములలో పొడచూపుతుంది. ఈ మద్యము పరిత్యజించిన లక్షణములకు (alcohol withdraw:: 222 ::