పుట:Hello Doctor Final Book.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తములో ట్రైగ్లిసరైడులు అధికముగా ఉండవచ్చును. ఇవి అసాధారణముగా ఉన్నపుడు మద్యపానము గుఱించి వైద్యులు ప్రశ్నించి సమాచారము గ్రహించాలి. చికిత్స :-

మద్యపానము అధికముగా చేసేవారిలో ఆహార లోపములు ఉండే అవకాశము ఉంది. వారికి థయమిన్ (విటమిన్ బి -1) అందించాలి. ఫోలికామ్లము వంటి మిగిలిన విటమిన్ లోపములను సరిదిద్దాలి. రక్త పరీక్షలలో విద్యుద్వాహక లవణముల లోపములను సరిదిద్దాలి.

మద్యపాన వ్యసనము మానుటకు మార్గము మద్యపానము పూర్తిగా మానివేసి దాని జోలికి వెళ్ళక పోవుటయే. వ్యసనమునకు లోబడిన వారు పూర్తిగా మానివేయుటకు నిర్ణయము తీసుకోవాలి. స్మృతి వర్తన చికిత్స (Cognitive behavioral therapy) వారికి తోడ్పడుతుంది. మద్యమునకు లోబడిన వారు:-

(1) నేను  మద్యపానమును మానుట ఈ దినము మొదలు పెడుతాను

(2) ఈ దినము నుంచి మద్యపానమును ఇంత మేరకు తగ్గించుకు పోతాను (3) ఈ దినము నుంచి మద్యపానమును పూర్తిగా విరమిస్తాను.

(4) ఆ పై ఎన్నడూ మద్యము జోలికి పోను అని నిర్ణయించుకోవాలి.

వారు వారి మద్యము సేవించు పద్ధతులను, వారిని మద్యపానమునకు ప్రోత్సహించు పరిస్థితులను, అవకాశములను, వారు సేవించే మద్య పరిమాణమును దినచర్య పుస్తకములో వ్రాసుకోవాలి. అట్టి పరిస్థితులు, అవకాశముల నుంచి దూరముగా ఉండాలి. వారికి మద్యపానము విరమించుటలో మానసిక చికిత్సకులు కాని, మానసిక సలహాదారులు కాని, కుటుంబసభ్యులతో పాటు తోడ్పడవలసిన అవసరము ఉంటుంది. మానసిక చికిత్సకులు అందు బాటులో లేనపుడు కుటుంబసభ్యులు కాని, స్నేహితులు కాని ఆ స్థానమును భర్తీ చేయుటకు పూనుకోవాలి. మద్యపాన వ్యసనమునకు లోనయిన వారు చెప్పేది సానుభూతితో వినుట, వారికి తగిన సలహాలను ఇచ్చుట, వారిచేతనే

221 ::