పుట:Hello Doctor Final Book.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధినిర్ణయము :-

మద్య వ్యసనము బారిపడినవారు తామంత తాము చికిత్సకు రావచ్చు. కొన్ని సందర్భములలో కుటుంబసభ్యులు వారిని వైద్యుల ఒద్దకు తీసుకొని రావచ్చును. మితము మించి మద్యపానము  చేసే వారిని పసిగట్టుటకు వైద్యులు  క్రింది ప్రశ్నలు వేస్తారు.

(1) మీరు ఎప్పుడైనా మద్యపానము తగ్గించవలసిన అవసరము ఉందని భావించారా ?

(2) ఎవరైనా మీ మద్యపానపు అలవాటుని విమర్శించి మిమ్ములను ఇబ్బంది పెట్టారా ? (3) మీ మద్యపానము గుఱించి ఎప్పుడైనా అపరాధ భావము పొందారా ? (4) ఉదయము నిద్ర లేవగానే ఎపుడైనా మద్యమును సేవించారా ?

ఇవి కాక మరికొన్ని ప్రశ్నలతో చాకచక్యముగా వైద్యులు మద్యపానము ఎక్కువగా చేసే వారిని పసిగట్టగలరు. మద్యపాన వ్యసనము  ఒక వ్యాధి అని తలచి వైద్యులు వైద్యము సమకూర్చాలి. మద్యపానము సలిపే వారిని అపరాధులుగా తలచకూడదు. పరీక్షలు :-

మద్యపాన వ్యసనము కనిపెట్టుటకు ప్రత్యేక పరీక్షలు లేవు. మద్యపానము కలుగజేసే కాలేయవ్యాధులు, క్లోమతాపము ( pancreatitis), మూర్ఛవ్యాధి,  మానసిక స్థితులు, మస్తిష్క వ్యాధులు, తఱచు పడిపోవుట వలన గాయములు మద్యపానమును సూచించవచ్చును. రక ్తపరీక్షలు :-

మద్యపానము అధికముగా చేసేవారిలో పృథురక్తకణ రక్తహీనత (macrocytic anemia) ఉండవచ్చును. రక్తములో  కాలేయ జీవోత్ప్రేరకముల ( Aspartate transaminase, Alanine transaminase, Gamma glutamyl transferase ) పరిమాణములు ఎక్కువగా ఉండవచ్చును.

220 ::