పుట:Hello Doctor Final Book.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీర ్ఘకాల ప్రభావము :-

దీర్ఘకాలము మద్యము సేవించువారిలో పలు నాడులు బలహీనపడుతాయి (polyneuropathy). వీరిలో థయమిన్ (thiamine; vitamin B1 ) లోపించి నేత్ర కండరముల బలహీనత (opthalmoplegia), మతిభ్రమణము (confusion), అస్థిర గమనము (ataxia) కలుగుతాయి. ఈ మూడు లక్షణములు గల వ్యాధి Wernicke encephalopathy గా ప్రాచుర్యము పొందింది. ఈ వ్యాధిగ్రస్థులకు థయమిన్ సమకూర్చి చికిత్స చేయనిచో వారు మృత్యువాత పడే అవకాశములు ఉన్నాయి. దీర్ఘకాలము మద్యము వినియోగించేవారిలో మస్తిష్కకణ నష్టము కలిగి వారి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొత్త విషయములకు మతిమఱపు (antegrade amnesia), పాత విషయములకు మతిమఱపు (retrograde amnesia), అప్పటి సంగతులకు మతిమఱపు (amnesia of fixation), గందరగోళము, చూస్తాము. చిన్న మెదడుపై మద్య ప్రభావము వలన వీరి చేతులలో కంపనము, అస్థిర చలనము, తూలిపడుట కలుగుతాయి. కండర సమన్వయము తగ్గుతుంది. మద్యపానము వలన కలుగు మానసిక రుగ్మతలు :

మద్యపానము వలన మానసిక రుగ్మతలు కూడా కలుగుతాయి. ఆందోళన (anxiety), గాభరా, మానసిక క్రుంగు (depression), మతిభ్రమ (psychosis), స్మృతిభ్రంశము (సన్నిపాతం;delirium) మద్యపానము సలిపే వారిలో తఱచు కలుగుతాయి. మద్యపానము సలిపేవారిలో ఆత్మహత్యల శాతము మిగిలిన వారిలో కంటె ఎక్కువ. మద్యపాన వ్యసనము కలవారిలో మిగిలిన మాదకద్రవ్యముల వినియోగము కూడా హెచ్చు. అవయవ లోపములు :- గర్భిణీస్త్రీలు మద్యపానము చేస్తే వారి శిశువులకు పుట్టుకతో అవయవ లోపములు కలిగే అవకాశము ఉన్నది. గర్భిణీస్త్రీలు మద్యము సేవించకూడదు.

218 ::