పుట:Hello Doctor Final Book.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారంగ కాలేయవ్యాధి ( Cirrhosis of Liver ) :-

అధికముగా మద్యము త్రాగేవారిలో 10 నుంచి 20 శాతము మందిలో, కాలేయతాపము (hepatitis), కణవిధ్వంసము (necrosis), తంతీకరణము (fibrosis) పదేపదే జరిగి నారంగ కాలేయవ్యాధికి (cirrhosis of liver) దారితీస్తాయి. సారాయి వాడుక కొనసాగించినపుడు  నారంగ కాలేయవ్యాధి తీవ్రమయి కాలేయవైఫల్యము (hepatic failure), మరణము కలుగుతాయి. పచ్చకామెరలు (jaundice), జలోదరము (ascites), నారంగ కాలేయవ్యాధిలో కొన్ని లక్షణములు. పచ్చకామెరులు వలన వీరి కాలేయము నారింజపండు రంగులో ఉంటుంది. జీర్ణా శయ వ్యాధులు :

మద్యపానము సలిపే వారి జీర్ణాశయములో ఉదజ హరికామ్లము (hydrochloric acid) అధికముగా స్రవించి జీర్ణాశయ తాపము (Gastritis) కలిగిస్తుంది. జీర్ణాశయ తాపము కలిగిన వారిలో వాంతిభావన, వాంతులు, కడుపునొప్పి, ఆకలి మందగించుట, కడుపు ఉబ్బు పొడచూపుతాయి. వీరి జీర్ణాశయములు హెలికోబేక్టర్ పైలొరై (Helicobacter Pylori) అనే సూక్ష్మాంగజీవుల బారి పడితే వారిలో జీర్ణవ్రణములు (Peptic ulcers) కలిగే అవకాశము ఉన్నది. జీర్ణ వ్రణములు కలవారు మద్యపానము చేస్తే  ఆమ్లము అధికముగా ఉత్పత్తి అయి ఆ వ్రణములు తీవ్రము అవుతాయి. త్వరగా మానవు. క్లో మ తాపము ( Pancreatitis ) :

ఎక్కువ మోతాదులలో మద్యపానము చేసేవారిలో సత్వర క్లోమ తాపము (Acute pancreatitis),  దీర్ఘకాల క్లోమతాపము (Chronic Pancreatitis) కలిగే అవకాశములు హెచ్చు. హృదయ వ్యాధులు :

మద్యపానము ఎక్కువగా చేసే వారి రక్తములో ట్రైగ్లిసరైడులు పెరిగి ధమనీ కాఠిన్యత (Atherosclerosis) త్వరితముగా కలుగుతుంది. అందువలన

216 ::